AP News: బీడి ముట్టించుకుని అగ్గిపుల్ల కింద పడేశాడు.. కట్ చేస్తే.. భగ్గున

AP News: బీడి ముట్టించుకుని అగ్గిపుల్ల కింద పడేశాడు.. కట్ చేస్తే.. భగ్గున

Ram Naramaneni

|

Updated on: Aug 21, 2024 | 11:55 AM

ఆయన జస్ట్ బీడీ ముట్టించుకుని అగ్గిపుల్ల కింద పడేశాడు. వెంటనే ఎర్రటి మంటల భగ్గున వ్యాపించాయి. దీంతో అక్కడున్న వారంతా పరుగులు తీశారు. పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో మంటలు అక్కడికి వ్యాపిస్తాయి అని అందరూ హైరానా పడ్డారు.

కల్యాణదుర్గంలో అగ్ని ప్రమాదం టెన్షన్ రేపింది.  ఓ వ్యక్తి అగ్గిపుల్ల రాజేసి..  బీడీ ముట్టించుకుని.. కింద పడేయడంతో ఈ ఘోరం జరిగింది.
అతడు విసిరేసిన అగ్గిపుల్ల రోడ్డుపై పడిన పెట్రోలుకు అంటుకుని.. సెకన్ల వ్యవధిలో భగ్గున మంటలు వ్యాపించాయి.  ఈ మంటలకు రోడ్డు పక్కనున్న ద్విచక్ర వాహనాలకు విస్తరించడంతో.. అవి కొంతమేర కాలిపోయాయి. పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో.. అందరూ ఆందోళనకు గురయ్యారు. స్థానికులంతా కలిసి నీళ్లు పోసి.. ఆ మంటలను అదుపులోకి తెచ్చారు. పెను ప్రమాదం, ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన వెంటనే.. పోలీసులు స్పాట్‌కు వచ్చి వివరాలు సేకరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Published on: Aug 21, 2024 11:53 AM