Crime: ప్రేమించానంటూ ఒకరు.. బెదిరించి మరో ఇద్దరు బాలికపై అత్యాచారం.! ఛీ ఇదేం పాడుపని..
ఇంటర్ చదువుతున్న బాలుడు.. పదో తరగతి చదువుతున్న బాలిక.. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.. వారిద్దరూ రహస్యంగా ఉండగా బాలుడి స్నేహితులు ఫోటోలు, వీడియోలు తీసారు. వాటిని బాలికకు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు.
కరీంనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ పట్టణానికి చెందిన ఓ బాలిక 10వ తరగతి చదువుతోంది. అదే కాలనీకి చెందిన ఓ బాలుడు ఇంటర్ చదువుతున్నాడు.. వారిద్దరూ ప్రేమించుకునేవారు. కొన్ని నెలల కింద వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను బాలుడి ఇద్దరు స్నేహితులు రహస్యంగా రికార్డు చేసి, బాలికను బ్లాక్‌మెయిల్ చేసి లొంగదీసుకుని ఆమెపై అత్యాచారినికి పాల్పడ్డారు. ఇలా పలుమార్లు దారుణానికి ఒడిగట్టారు. ఈ విషయం తెలుసుకున్న వారిద్దరి స్నేహితులైన మరో ముగ్గురు కూడా బాలికను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. దాంతో మూడు రోజుల క్రితం ఈ విషయం షీటీమ్ దృష్టికి వెళ్లింది. అనంతరం పోలీసులు నిందితులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. ఆ తర్వాత ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. అయితే, సోమవారం బాలిక, తల్లిదండ్రులతో కలిసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు బాలిక ప్రేమికుడితోపాటు ఆరుగురిపై పోక్సో, అత్యాచారం, బెదిరింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదైన ఆరుగురిలో అయిదుగురు ఇంటర్ చదువుతుండగా.. మరో వ్యక్తి మేజర్ అని పాలిటెక్నిక్ చదువుతున్నాడని పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..