Puri Jagannath: తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
ఒడిశాలోని పూరీ క్షేత్రంలో 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం తెరుచుకుంది. ఒడిశా అధికారుల బృందం ఆదివారం విజయవంతంగా దీనిని ఓపెన్ చేసింది. ఆలయంలోని ఈ రహస్య గదిని తెరిచిన అనంతరం సిబ్బంది లోపలకు జాగ్రత్తగా ప్రవేశించారు. స్నేక్ క్యాచర్స్ తో పాటు వైద్య బృందాన్ని కూడా అక్కడే ఉంచారు. కానీ రత్నభాండాగారం లోపలకు వెళ్లిన ఎస్పీ పినాక్ మిశ్రా అస్వస్థతకు గురయ్యారు. దాంతో వైద్యులు ఆయనకు ప్రథమ చికిత్స అందించారు.
ఒడిశాలోని పూరీ క్షేత్రంలో 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం తెరుచుకుంది. ఒడిశా అధికారుల బృందం ఆదివారం విజయవంతంగా దీనిని ఓపెన్ చేసింది. ఆలయంలోని ఈ రహస్య గదిని తెరిచిన అనంతరం సిబ్బంది లోపలకు జాగ్రత్తగా ప్రవేశించారు. స్నేక్ క్యాచర్స్ తో పాటు వైద్య బృందాన్ని కూడా అక్కడే ఉంచారు. కానీ రత్నభాండాగారం లోపలకు వెళ్లిన ఎస్పీ పినాక్ మిశ్రా అస్వస్థతకు గురయ్యారు. దాంతో వైద్యులు ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తలుపులు తెరిచేందుకు ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి బిశ్వనాథ్ రథ్, జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధీతోపాటు ASI సూపరింటెండెంట్ లోపలికి వెళ్లారు. వీళ్లతోపాటు నలుగురు సహాయకులు వెళ్లినట్లు సమాచారం.
కాగా, రత్న భాండాగారంలో నిధిని తరలించేందుకు పెద్ద చెక్క పెట్టెలను ప్రభుత్వం సిద్ధం చేసింది. వాటిని ప్రత్యేక వాహనంలో పూరీ ఆలయం వద్దకు చేర్చారు. పూరీలోని జగన్నాథ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. ఆలయంలోని రత్న భాండాగారంలో జగన్నాథ స్వామి, సుభద్ర, భలభద్రలకు చెందిన విలువైన ఆభరణాలను భద్రపరిచారు. ఈ భాండాగారాన్ని తెరిచే ముందు కీలకమైన క్రతువు ‘ఆజ్ఞ’ను నిర్వహించారు. కాగా, ఈ రహస్య గదిని తెరిచే సందర్భంగా పాములు పట్టే బృందాలను కూడా మోహరించారు. నాలుగున్నర దశాబ్దాలుగా గదిని మూసి ఉంచడంతో, లోపల విషసర్పాలు ఉంటాయన్న అనుమానంతో పాములు పట్టే నిపుణులను సిద్ధంగా ఉంచారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.