Viral: గుంత తీసి పాతి పెట్టడానికి  పక్కా ప్లాన్‌ వేశాడు.. చివరకు.! వివాహేతర సంబంధం..

Viral: గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు.. చివరకు.! వివాహేతర సంబంధం..

Anil kumar poka

|

Updated on: Jul 17, 2024 | 2:22 PM

తాను అనుకున్నది చేయగలను అన్న నమ్మకం అతనికి కలిగింది. వెంటనే ఇద్దరూ మనుషులను పాతి పెట్టగలిగేంత గుంత తీశాడు. ప్లాన్‌ ప్రకారం అక్కడికి ఆమెను తీసుకొచ్చాడు. గొంతు నులిమేశాడు. ఆమె కూడా చనిపోయినట్లు పడిపోయింది. అయితే ఆమె కొడుకును తీసుకొచ్చేంత వరకూ అలాగే ఉండి అప్పుడు పారిపోయింది. దీంతో అతని ప్లాన్ పోలీసులకు తెలిసిపోయి నిందితుడి కోసం వెదుకులాట ప్రారంభమయింది.

పల్నాడు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్లకు చెందిన శ్రీనివాసరావు తాపీ పనులకోసం హైదరాబాద్ లోని గచ్చిబౌలికి వెళ్లాడు. అక్కడ పనిచేస్తుండగా మహబూబ్ నగర్ చెందిన శైలజ కుమారుడు శివతో పరిచయం అయింది. తరువాత శైలజతో పరిచయం పెరిగింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే ఆమె గర్భవతి అయింది. దీంతో ఇద్దరిలో కంగారు మొదలైంది. అయితే ముప్పాళ్ల వెళ్లి అక్కడ గర్భస్రావం చేయించుకుందామని శ్రీనివాసరావు చెప్పాడు. అతని మాటలు నమ్మిన శైలజ, శివ.. ఇద్దరూ అతనితో పాటు ముప్పాళ్ల వచ్చారు. అక్కడున్న ఒక రెస్టారెంట్ వద్ద శివను దించిన శ్రీనివాసరావు ఆమెను బైక్ పై ఎక్కించుకొని అద్దంకి బ్రాంచ్ కెనాల్ వరకూ తీసుకొచ్చాడు. అక్కడ ఆమె గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆమె కిందపడిపోయి చనిపోయినట్లు నటించింది. వెంటనే అక్కడ నుండి శ్రీనివాసరావు వెళ్లి శివను బైక్ పై ఎక్కించుకొని తిరిగి బ్రాంచ్ కెనాల్ వద్దకు తీసుకొచ్చాడు. అయితే అనుమానం వచ్చిన శివ బైక్ దూకి పారిపోయి చెట్ల మధ్యలో దాక్కొన్నాడు. ఇదంతా గమనిస్తున్న శైలజ వెంటనే లేచి సమీపంలో ఉన్న పవర్ ప్లాంట్ వద్దకు వెళ్లి రక్షించాలంటూ వేడుకొంది. దీంతో స్తానికులు ఆమెను కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఇది తెలుసుకున్న శ్రీనివాసరావు బైక్ వదిలి పెట్టి అక్కడ నుండి పారిపోయాడు. ఘటన స్థలానికి దగ్గరలోనే గుంత తీసి ఉండటాన్ని పోలీసులు గమనించారు. వారిద్దరిని చంపి పూడ్చి పెట్టాలన్న ఉద్దేశంతోనే శ్రీనివాసరావు ఇదంతా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శైలజ, ఆమె కుమారుడి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు శ్రీనివాసరావు కోసం గాలిస్తున్నారు. శ్రీనివాసరావు నిజ స్వరూపం తెలుసుకుని తల్లి కొడుకులిద్దరూ షాక్ కు గురయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.