Puri Temple secret: సర్పాలు బుసలు కొడుతున్న శబ్దాలు.. రహస్య గదిలో ఏముంది.?(వీడియో)
ఒడిశాలోని పూరీ ఆలయ భాండాగారంలో ఆస్తుల విలువ ఎంత? అందులోని మూడో గదిని తెరవరెందుకు? ఈ విషయాలపై తీవ్ర చర్చ సాగుతోంది. ఈ భాండాగారానికి చెందిన మూడో గది
ఒడిశాలోని పూరీ ఆలయ భాండాగారంలో ఆస్తుల విలువ ఎంత? అందులోని మూడో గదిని తెరవరెందుకు? ఈ విషయాలపై తీవ్ర చర్చ సాగుతోంది. ఈ భాండాగారానికి చెందిన మూడో గది నుంచి సొరంగ మార్గం ఉందన్న సమాచారమూ వినిపిస్తోంది. ఈ గదిలో అపార సంపద వజ్ర, వైడూర్య, గోమేధిక, పుష్పరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణ కిరీటాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు.1926 నాటి బ్రిటిష్ పాలకులు రత్న భాండాగారం తెరిపించారు. అప్పట్లో చెన్నైకి చెందిన నిపుణులు ఆభరణాలను లెక్కించారు. 597 రకాల ఆభరణాలు ఉన్నాయని వాటి సంపద వెలకట్టలేమని, రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు ఉన్నట్లు శ్రీక్షేత్ర ఆస్తుల పట్టికలో రాసినట్లు ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ సురేంద్ర మిశ్ర ఇటీవల పూరీలో విలేకరులకు తెలిపారు. రహస్యగది కింద సొరంగమార్గం ఉందని, దాని కింద మరిన్ని గదులున్నాయని అప్పట్లో చెన్నె నిపుణులు తెలిపినట్లు వివరించారు. తాము భూగర్భంలో ఉన్న ఆ గదులకు వెళ్లలేకపోయామని, లోపల సర్పాలు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించినట్లు ఆస్తుల గురించి రాసిన పట్టికలో ఒకచోట వారు పేర్కొన్నట్లు మిశ్ర తెలిపారు. 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉత్కళను పాలించిన 46 మంది రాజులు పురుషోత్తముడి భక్తులని, వారు స్వామి కోసం వెలకట్టలేని సంపదను రహస్య గదుల్లో భద్రపరిచినట్లు చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Pawan Kalyan: వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).
Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)