Delhi: ఎయిర్ ఇండియా విమానంలో భారీ శబ్దం.. వెంటనే ల్యాండ్‌ చేసిన పైలట్‌.

Delhi: ఎయిర్ ఇండియా విమానంలో భారీ శబ్దం.. వెంటనే ల్యాండ్‌ చేసిన పైలట్‌.

Anil kumar poka

|

Updated on: Nov 29, 2023 | 6:32 PM

టేకాఫ్‌ అయిన విమానంలో ఒక్కసారిగా భారీ శబ్దం వెలువడింది. ఆ శబ్దానికి విమానంలో ఉన్న ప్రయాణికులంతా తీవ్ర భయాందోళన చెందారు. అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని టేకాఫ్ అయిన చోటే ల్యాండ్‌ చేశారు. శనివారం సాయంత్రం నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి ఢిల్లీ రావాల్సిన ఎయిరిండియా విమానాన్ని టేకాఫ్ తీసుకున్న తర్వాత, తిరిగి అదే ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాన్ని అక్కడే ల్యాండ్‌ చేయాల్సి వచ్చిందని..

టేకాఫ్‌ అయిన విమానంలో ఒక్కసారిగా భారీ శబ్దం వెలువడింది. ఆ శబ్దానికి విమానంలో ఉన్న ప్రయాణికులంతా తీవ్ర భయాందోళన చెందారు. అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని టేకాఫ్ అయిన చోటే ల్యాండ్‌ చేశారు. శనివారం సాయంత్రం నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి ఢిల్లీ రావాల్సిన ఎయిరిండియా విమానాన్ని టేకాఫ్ తీసుకున్న తర్వాత, తిరిగి అదే ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాన్ని అక్కడే ల్యాండ్‌ చేయాల్సి వచ్చిందని అధికారులు ప్రకటించారు. టేకాఫ్ సమయంలో శబ్దం రావడమే ఇందుకు కారణమని వెల్లడించారు. టేకాఫ్‌కు ముందు విమానంలోని డోర్ పనికిరాదని గమనించామని, అయితే అవసరమైన భద్రత ప్రోటోకాల్‌ను అనుసరించి విమానం టేకాఫ్ కోసం క్లియరెన్స్ ఇచ్చారని అధికారులు వివరించారు. విమానం తిరిగి ఖాట్మండు‌లోనే ల్యాండవ్వడానికి ఈ అంశాలకు సంబంధంలేదని, భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడలేదని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి పేర్కొన్నారు. విమానం తోక భాగంలో ఏమైనా సమస్య ఉందేమోనని పైలెట్లు అనుమానించారని, ల్యాండింగ్ తర్వాత ఎలాంటి సమస్య లేదని నిర్ధారించామని ఓ అధికారి వెల్లడించారు. శబ్దం వినిపించడంతో ముందు జాగ్రత్త చర్యగా తిరిగి ఖాట్మండు విమానాశ్రయానికి వెళ్లాలని పైలెట్ నిర్ణయించుకున్నాడని వివరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Nov 29, 2023 06:31 PM