Buffaloes – Tiger: మీరు చదివింది నిజమే..! ఐకమత్యమే బలం అని ఇందుకే అన్నారేమో..
సాధారణంగా పులులు, సింహాలు ఇతర జంతువులపై దాడి చేయడం మనకు తెలుసు. వాటి కంట పడ్డ జంతువైనా, మనిషైనా తప్పించుకోవడం అసాధ్యమని చెప్పొచ్చు. ఎందుకంటే అవి వేటకు దిగాయంటే వెనకడుగు వేయవు. అలాంటి క్రూర మృగాన్ని కొన్ని గేదెలు కలిసి మూకుమ్మడిగా దాడి చేసి హతమార్చాయి.
సాధారణంగా పులులు, సింహాలు ఇతర జంతువులపై దాడి చేయడం మనకు తెలుసు. వాటి కంట పడ్డ జంతువైనా, మనిషైనా తప్పించుకోవడం అసాధ్యమని చెప్పొచ్చు. ఎందుకంటే అవి వేటకు దిగాయంటే వెనకడుగు వేయవు. అలాంటి క్రూర మృగాన్ని కొన్ని గేదెలు కలిసి మూకుమ్మడిగా దాడి చేసి హతమార్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకాలో ఈ ఘటన వెలుగు చూసింది. కొంతకాలంగా ఆ ప్రాంతంలో పులి సంచారంతో స్థానికుల కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఎస్‌గ్రావ్ గ్రామ పరిసరాల్లో ఓ పశువుల కాపరిపై పులి దాడికి యత్నించింది. చేతిలో ఉన్న గొడ్డలితో అతడు ఎదురు తిరగడంతో త్రుటిలో అతడు చావు నుంచి తప్పించుకోగలిగాడు. ఆ తరువాత పులి బెంబడా గ్రామంలోని అటవీ పరిసరాల్లో మేత మేస్తున్న ఆవులు, గేదెలపై దాడికి యత్నించింది. అయితే, ఊహించని విధంగా గేదెలు పులిపై మూకుమ్మడిగా దాడి చేశాయి. కొమ్ములతో పొడిచేశాయి. తీవ్రంగా గాయపడ్డ పులిని అటవీ శాఖ అధికారులు చంద్రపూర్‌కు తరలించగా అది చికిత్స పొందుతూ మృతి చెందింది. సాధు జంతువులైనా ఐకమత్యంగా ఉండటం వల్ల తమకు ఎదురైన ప్రమాదాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాయి అంటున్నారు నెటిజన్లు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...