Lockdown Effect: లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
ప్రపంచమంతా కరోనా వల్ల లాక్‌డౌన్ సమయంలో గది గోడలకే పరిమితమైంది. దీంతో చంద్రుడిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గినట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. కొవిడ్-19 ప్రపంచాన్ని క్రమంగా కబళిస్తుండడంతో తొలుత చైనా లాక్‌డౌన్ విధించింది. ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఒక్కొక్కటిగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఫలితంగా అన్ని వ్యవస్థలు స్తబ్దుగా మారిపోయాయి.
ప్రపంచమంతా కరోనా వల్ల లాక్‌డౌన్ సమయంలో గది గోడలకే పరిమితమైంది. దీంతో చంద్రుడిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గినట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. కొవిడ్-19 ప్రపంచాన్ని క్రమంగా కబళిస్తుండడంతో తొలుత చైనా లాక్‌డౌన్ విధించింది. ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఒక్కొక్కటిగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఫలితంగా అన్ని వ్యవస్థలు స్తబ్దుగా మారిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోగా, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. దీంతో గ్రీన్‌హౌస్ ఉద్గారాల విడుదల పూర్తిగా ఆగిపోయింది.
ఇక ఈ ప్రభావం చంద్రుడిపైనా పడినట్టు అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబరేటరీ కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో వెలుగుచూసింది. ఈ అధ్యయన వివరాలు పీర్ రివ్యూడ్ జర్నల్ ‘మంత్లీ నోటీసెస్ ఆఫ్ రాయల్ అస్ట్రోనామికల్ సొసైటీ: లెటర్స్’లో పబ్లిష్ అయ్యాయి. 2020 ఏప్రిల్-మే మధ్య లాక్‌డౌన్ సమయంలో చంద్రుడిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయినట్టు అధ్యయనం పేర్కొంది. నాసాకు చెందిన లూనార్ రీకనాయిసెన్స్ ఆర్బిటర్ డేటాను విశ్లేషించగా ఈ విషయం బయటపడింది.
చంద్రుడిపై మనకు కనిపించే భాగంలో.. రాత్రి సమయంలో ఆరు ప్రత్యేక ప్రాంతాల్లోని ఉపరితల ఉష్ణోగ్రతలను అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరంగా అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే లాక్‌డౌన్ సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రత 8 నుంచి 10 డిగ్రీలు తగ్గినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా 2017 నుంచి 2023 వరకు డేటాను విశ్లేషించారు. లాక్‌డౌన్ సమయంలో వచ్చిన మార్పుల కారణంగా భూమి నుంచి వేడి గణనీయంగా తగ్గడమే దీనికి కారణమన్నారు శాస్త్రవేత్తలు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

