Tamilnadu: ఊటీ ప్లాన్ చేశారా..? అయితే వెంటనే క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే..?
భారీ వర్షలతో తమిళనాడు వణికిపోతోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వర్షాల కారణంగా తమిళనాడులో 7 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. చెన్నై, కన్యాకుమారి, కడలూరు సహా కొన్ని జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇక నీలగిరిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో.. ఊటీకి వెళ్లే వాహనాలు, రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు.
భారీ వర్షలతో తమిళనాడు వణికిపోతోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వర్షాల కారణంగా తమిళనాడులో 7 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. చెన్నై, కన్యాకుమారి, కడలూరు సహా కొన్ని జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇక నీలగిరిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో.. ఊటీకి వెళ్లే వాహనాలు, రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. కొండచరియలు విరిగిపడి పట్టాలపై పెద్దపెద్ద బండరాళ్లు పడిపోయాయి. వీటిని సిబ్బంది తొలగిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా తేని జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా దక్షిణ తమిళనాడులో భారీగా పంట నష్టం వాటిల్లింది. మరో మూడు రోజుల పాటు తమిళనాడు పాండిచ్చేరి, కారైక్కల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. చెన్నై ప్రాంతీయ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం రాబోయే మూడు రోజులు కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాసి, తేని, దిండిగల్, విరుదునగర్, మధురై, శివగంగ, పుదుక్కోట్టై, తిరుప్పూర్, కోయంబత్తూర్, నీలగిరి, ఈరోడ్, క్రిష్ణగిరి, ధర్మపురి, తూత్తుకుడి, రామనాథపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు కేరళలోని కొన్ని ప్రాంతాల్లో నవంబరు 8 వరకూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

