Viral: కొబ్బరికాయల లోడ్ అనుకునేరు.. అసలు సంగతి తెలిస్తే మీటర్ లేచుద్ది..!

అక్రమ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. స్మగ్లర్లకు అడ్డకట్ట పడటం లేదు.. గంజాయి రవాణాకు స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను వెతుకుతూ.. అధికారుల కళ్లు గప్పి రాష్ట్రాలను దాటించేస్తున్నారు. తాజాగా

Viral: కొబ్బరికాయల లోడ్ అనుకునేరు.. అసలు సంగతి తెలిస్తే మీటర్ లేచుద్ది..!

|

Updated on: May 30, 2022 | 8:17 AM


అక్రమ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. స్మగ్లర్లకు అడ్డకట్ట పడటం లేదు.. గంజాయి రవాణాకు స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను వెతుకుతూ.. అధికారుల కళ్లు గప్పి రాష్ట్రాలను దాటించేస్తున్నారు. తాజాగా ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో సుమారు 16 క్వింటాళ్ల గంజాయిని జయపురం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుష్ప సినిమాలోని సీన్‌ను రిపీట్ చేయాలనుకున్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.పక్కా సమాచారంతో జయపురం పోలీసులకు అక్రమంగా గంజాయి రవాణాకు చెక్ పెట్టారు. స్థానిక ఘాట్ రోడ్డులో మాటు వేసిన ఎక్సైజ్ సిబ్బంది.. ప్రతీ వెహికిల్‌ను ముమ్మరంగా చెక్ చేస్తుండగా.. అతి వేగంగా వస్తోన్న ఓ ట్రక్కు వారి కంటపడింది. దాన్ని ఆపి సోదా చేయగా.. అందులో 100 బస్తాల కొబ్బరికాయలు, 150 గంజాయి బస్తాలు బయటపడ్డాయి. స్మగ్లర్లు చాలా తెలివిగా కొబ్బరికాయల లోడ్‌తో గంజాయి బస్తాలను కవర్ చేశారు. పట్టుబడిన సరుకు సుమారు రూ. 81 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అసలు స్మగ్లర్ కోసం వేట మొదలుపెట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

Follow us