Shocking Video: బాబోయ్.. పురుగుల వర్షం.. అక్కడి రోడ్లు, కార్లు అన్నీ పురుగులే..
చైనాలో పురుగుల వర్షం కురిసింది. చైనా రాజధాని బీజింగ్‌లో రోడ్లు, వాహనాలు అన్నీ పురుగుల వర్షంతో నిండిపోయాయి. ఈ పురుగుల వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఇటీవల ప్రపపంచంలో వింత వింత ఘటనలు జరుగుతున్నాయి. సమ్మర్‌లో వడగళ్ల వాన సహజం, కానీ ఇటీవల చేపల వర్షం, కప్పల వర్షం ఇలా రకరకాల వర్షాలు జనాలను ఆశ్చర్యానికి గురి చేశాయి. తాజాగా చైనాలో పురుగుల వర్షం కురిసింది. చైనా రాజధాని బీజింగ్‌లో రోడ్లు, వాహనాలు అన్నీ పురుగుల వర్షంతో నిండిపోయాయి. ఈ పురుగుల వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బీజింగ్ రోడ్డుపై నిలిచిన కార్లపై ఆకాశం నుంచి వర్షంతోపాటు పెద్ద సంఖ్యలో పురుగులు పడినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. అయితే ఈ పురుగుల వర్షానికి కారణం తెలియలేదని తెలిపింది. బలమైన గాలులకు బురదలోని పురుగులు పైకి ఎగిరి వెళ్లిఉంటాయని, ఇప్పుడు ఇలా వర్షంతోపాటు కురుస్తున్నాయని సైంటిఫిక్ జర్నల్ మదర్ నేచర్ నెట్‌వర్క్ తెలిపినట్లు తెలిపింది. తుఫాను తర్వాత వీచే భారీ గాల్లుల్లో పురుగులు, కీటకాలు చిక్కుకున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఆ జర్నల్ పేర్కొన్నట్లు వివరించింది. కాగా, ఈ పురుగుల వర్షానికి సంబంధించిన వీడియోను చైనాలోని ఇన్‌సైడర్ పేపర్ మార్చి 11న ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. పురుగులు మీద పడకుండా ఉండేలా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించినట్లు అందులో పేర్కొంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోవైపు చైనా జర్నలిస్ట్ షెన్ షివే దీనిని ఖండించారు. పురుగుల వర్షం వీడియో ఫేక్ అని తెలిపారు. బీజింగ్ నగరంలో ఇటీవలి కాలంలో ఎలాంటి వర్షాలు పడలేదని, ‘తాను బీజింగ్‌లోనే ఉన్నానని, ఈ వీడియో నకిలీది అంటూ ట్వీట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!