Sub Inspector beat up man: జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ ఎస్‌ఐ రెచ్చపోయాడు. తాగిన మత్తులో పోలీస్ పెట్రోలింగ్ వాహనంపై రాళ్లు విసిరాడన్న కారణంతో కర్నూలుకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తిని ఎస్‌ఐ చితకబాదాడు. అతని ముఖంపై బూట్ కాలితో రాజోలి SI లెనిన్ బాబు తన్నడం వైరల్‌గా మారింది. దీనిని మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసిన స్థానికులు సోషల్ మీడియాలో అఫ్‌లోడ్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సరిహద్దుల్లో ఉన్న ఓ వైన్‌షాప్‌క్‌కి మందు మందుబాబులు భారీగా తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు మద్యం సేవిస్తూ కనిపించాడు లక్ష్మణ్. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తున్న సమయంలో లక్ష్మణ్ అనే యువకుడు ఎస్‌ఐతో గొడవ పడ్డాడు. అంతేకాదు వెహికల్‌పై రాళ్లతో దాడిచేశాడు. దీంతో ఊగిపోయిన డ్యూటీ ఎస్‌ఐ తన ప్రతాపాన్ని చూపించాడు. దీంతో లక్ష్మణ్‌ను చితకబాదడంతో పాటు బూట్ కాలితో ముఖంపై తన్నడంతో అక్కడిక్కడే కుప్పకూలాడు. దీంతో అతన్ని వదిలేసిన పోలీసులు మరొకరిని చావబాదారు.
కాగా, విచారణలో భాగంగా బూటుకాలితో తన్నుతుండగా…దూరం నుంచి ఎవరో సెల్‌ఫోన్ చిత్రీకరించి నెట్‌లో పెట్టారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్ధానికులు కోరుతున్నారు. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి జిల్లా పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Also… Lakshmi Manchu Photos: చీరకట్టుకుని ఆలయంలో ఫొటో ఫోజులతో కవ్విస్తున్న మంచు లక్ష్మి ప్రసన్న (ఫొటోస్)..