ఒక్క మాట అన్న లెక్చరర్‌ను కడిగి పారేసిన విద్యార్థి !! ధైర్యానికి ఫిదా అయిపోతున్న నెటిజన్లు
క్లాస్ రూమ్‌లో ఓ విద్యార్థి.. లెక్చరర్.. మధ్య జరిగిన వాగ్వివాదం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. లెక్చరర్ చేసిన కామెంట్‌పై.. ఆ స్టూడెంట్ ఓ రేంజ్‌లో రియాక్ట్ అయ్యాడు.
క్లాస్ రూమ్‌లో ఓ విద్యార్థి.. లెక్చరర్.. మధ్య జరిగిన వాగ్వివాదం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. లెక్చరర్ చేసిన కామెంట్‌పై.. ఆ స్టూడెంట్ ఓ రేంజ్‌లో రియాక్ట్ అయ్యాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ విద్యార్థి ధైర్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సీరియస్‌గా క్లాస్ జరుగుతున్న సమయంలో ఓ విద్యార్థిని ఉద్దేశించి లెక్చరర్ ముస్లిం టెర్రరిస్ట్ అంటూ అభివర్ణించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు విద్యార్థి ఓ రేంజ్‌లో సమాధానం ఇచ్చాడు. దీంతో ‘నువ్వు నా పిల్లవాడివి’ అంటూ లెక్చరర్ సముదాయించేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆ విద్యార్థి ‘ఇదే మాట నా తండ్రి అన్న ఖండిస్తాను.’ అంటూ ఎటాక్‌కు దిగాడు. మీరు మీ కొడుకుతో అలా మాట్లాడతారా..? మీరు అతడిని ఉగ్రవాది అని పిలుస్తారా..?” అని నిలదీశాడు. అయినా ‘క్లాసులో మీరొక లెక్చరర్ అయి ఉండి.. అందరి ముందు.. నన్ను అలా ఎలా అంటారు.’ అని కడిగిపారేశాడు. దానికి ఆ లెక్చరర్ క్షమాపణలు కోరారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు. విద్యార్థి చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చోర శిఖామణి.. మాటల్లో పెట్టి రూ.10 లక్షల నెక్లెస్ భలే కొట్టేసిందిగా !!
బిడ్డకోసం ఆ తల్లి పడిన తపన.. హార్ట్ టచ్చింగ్ వీడియో
15 ఏళ్లుగా అడవిలో నివాసం.. జంతువుల భయం క్షణక్షణ..
విద్యుత్ స్తంభంలో.. చిక్కుకుపోయిన విమానం..
సిగరెట్ తాగుతూ అర్ధ నగ్నంగా.. వర్చువల్ హియరింగ్‌లో పాల్గొన్న మహిళా జడ్జి
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

