విద్యుత్‌ స్తంభంలో.. చిక్కుకుపోయిన విమానం..

విద్యుత్‌ స్తంభంలో.. చిక్కుకుపోయిన విమానం..

Phani CH

|

Updated on: Dec 03, 2022 | 9:33 AM

అమెరికాలో ఓ చిన్న పాటి విమానం హైటెన్షన్‌ విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టింది. వంద అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఓ తేలికపాటి విమానం.. మేరీలాండ్‌లోని మాంట్‌గొమెరీలో విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టి అందులో చిక్కుకుపోయింది.

అమెరికాలో ఓ చిన్న పాటి విమానం హైటెన్షన్‌ విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టింది. వంద అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఓ తేలికపాటి విమానం.. మేరీలాండ్‌లోని మాంట్‌గొమెరీలో విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టి అందులో చిక్కుకుపోయింది. తాజాగా చోటు చేసుకున్న ఘటనలో విమానంలో ఇద్దరు ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో వారికి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. అయితే విమానం విద్యుత్‌ తీగలను ఢీ కొట్టడంతో విద్యుత్‌ తీగలు తెగిపోయి మాంట్‌గోమెరీలోని 90వేల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయాయి. వర్షాలు పడటంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ప్రమాదం నేపథ్యంలో విద్యుత్‌ తీగలు రోడ్డుపై పడి ఉన్నాయని.. అటువైపు ఎవరూ వెళ్లొద్దంటూ పోలీసులు ట్విట్టర్‌ ద్వారా అక్కడి ప్రజలను హెచ్చరించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సిగరెట్‌ తాగుతూ అర్ధ నగ్నంగా.. వర్చువల్‌ హియరింగ్‌లో పాల్గొన్న మహిళా జడ్జి

తోకతో పుట్టిన ఆడశిశువు.. అరుదుగా ‘ట్రూ టెయిల్స్‌’ శిశువుల జననం..

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వారానికి 4 రోజులే వర్కింగ్ డేస్..

Digital TOP 9 NEWS: చిన్నారి ప్రాణం తీసిన కోతి..ఏం జరిగిందంటే.! | రైలు ఎక్కలేక ఇబ్బందిపడ్డ మహిళ

Published on: Dec 03, 2022 09:33 AM