Sony: 900 మంది ఉద్యోగులకి గుడ్ బై చెప్పనున్న సోనీ కంపెనీ.

టెక్‌ పరిశ్రమలో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌ లాంటి సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ప్రముఖ టెక్‌ దిగ్గజం సోనీ (Sony) కి చెందిన ప్లేస్టేషన్‌ విభాగంలో భారీగా ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో 8 శాతం అంటే 900 మందిని త్వరలో తొలగించనుంది. పరిశ్రమలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొంది.

Sony: 900 మంది ఉద్యోగులకి గుడ్ బై చెప్పనున్న సోనీ కంపెనీ.

|

Updated on: Mar 01, 2024 | 12:35 PM

టెక్‌ పరిశ్రమలో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌ లాంటి సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ప్రముఖ టెక్‌ దిగ్గజం సోనీ (Sony) కి చెందిన ప్లేస్టేషన్‌ విభాగంలో భారీగా ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో 8 శాతం అంటే 900 మందిని త్వరలో తొలగించనుంది. పరిశ్రమలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొంది. పరిశ్రమలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకొంటున్నాయి. భవిష్యత్తు కోసం వ్యాపారాన్ని ఇప్పటి నుంచే సిద్ధం చేయాలి. గేమర్లు, డెవలపర్ల అంచనాలను అందుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో భవిష్యత్తు టెక్నాలజీలను గేమింగ్‌లోకి తీసుకెళ్లాలి. అందుకే ఈ విభాగంలో అత్యున్నత ఫలితాలు ఇవ్వడం కోసం మేం ఒక అడుగు వెనక్కి వేశాం. ఇది సవాళ్లతో కూడిన సమయం. అంతేకానీ, ఇది మా బలహీనతను సూచించదు అంటూ సోనీ ఇంటరాక్టీవ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సీఈవో జిమ్‌ ర్యాన్‌ బ్లాగ్‌లో చేసిన ఓ పోస్టులో పేర్కొన్నారు.మరోవైపు లండన్‌ ప్లేస్టేషన్‌ స్టూడియోను పూర్తిగా మూసివేయనున్నారు. దీని ఆధీనంలోని ఫైర్‌స్పిరిట్‌ స్టూడియోస్‌ సిబ్బందిలో కూడా కోత విధించే అవకాశం ఉంది. మరోవైపు సోనీ ఇంటరాక్టీవ్‌ ఎంటర్‌టైన్మెంట్‌లోని వివిధ విభాగాల్లో కూడా లేఆఫ్‌లు కొనసాగుతాయి. ఉద్యోగులను తొలగించే సమయంలో వారికి అందాల్సిన ప్రయోజనాలు చెల్లిస్తామని కంపెనీ పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Follow us
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ