Viral Video: తండ్రి పాడె మోసి.. అంత్యక్రియలు చేసిన కుమార్తెలు.. వీడియో.
మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. సంప్రదాయం పేరిట కొనసాగుతున్న తరతరాల ఆచారాన్ని కాదంటూ తొమ్మిదిమంది కుమార్తెలు తమ తండ్రి చితికి నిప్పంటించారు. ఈ ఘటన స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. బుందేల్‌ఖండ్ పరిధిలోని సాగర్‌లో రిటైర్డ్ పోలీసు హరిశ్చంద్ర అహిర్వార్ ఉంటున్నారు. అతనికి తొమ్మిది మంది కుమార్తెలు. కొడుకులు లేరు. వీరిలో ఏడుగురికి వివాహాలయ్యాయి.
మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. సంప్రదాయం పేరిట కొనసాగుతున్న తరతరాల ఆచారాన్ని కాదంటూ తొమ్మిదిమంది కుమార్తెలు తమ తండ్రి చితికి నిప్పంటించారు. ఈ ఘటన స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. బుందేల్‌ఖండ్ పరిధిలోని సాగర్‌లో రిటైర్డ్ పోలీసు హరిశ్చంద్ర అహిర్వార్ ఉంటున్నారు. అతనికి తొమ్మిది మంది కుమార్తెలు. కొడుకులు లేరు. వీరిలో ఏడుగురికి వివాహాలయ్యాయి. మరో ఇద్దరు కుమార్తెలకు వివాహం జరగాల్సివుంది. అయితే హరిశ్చంద్ర అహిర్వార్ అకస్మాత్తుగా బ్రెయిన్ హెమరేజ్‌కు గురై ఆసుపత్రిలో కన్నుమూశాడు. ఈ నేపథ్ధ్యంలో అతని కుమార్తెలు తమ తండ్రికి తామే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకున్నారు. వారందరూ అంతిమయాత్రలో పాల్గొని, ముక్తిధామ్‌లో తండ్రికి శాస్త్రోక్తంగా ఆ కార్యక్రమాన్ని జరిపించారు. దీనికి పెద్ద సంఖ్యలో స్థానికులు హాజరయ్యారు. హరిశ్చంద్ర అహిర్వార్ బంధువు ఛోటాలాల్ అహిర్వార్ మాట్లాడుతూ కుమార్తెలు తమ తండ్రికి హిందూ ఆచార సంప్రదాయాలను అనుసరిస్తూ అంత్యక్రియలు జరిపారని తెలిపారు. హరిశ్చంద్ర అహిర్వార్ తన ఏడుగురు కుమార్తెలకు వివాహాలు చేశారని, ఇంకా రోష్ని, గుడియాలకు వివాహాలు చేయాల్సివుందని అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

