Prashanth – Lena: ఆయన.. మా ఆయనే.! వెల్లడించిన ప్రముఖ నటి లీనా.
భారత్ చేపడుతున్న మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్ మిషన్’లో భాగంగా అంతరిక్షానికి ప్రయాణించనున్నారు నలుగురు వ్యోమగాములు . వీరిలో ఒకరైన కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను తాను పెళ్లి చేసుకున్నట్టు మలయాళ నటి లీనా ప్రకటించారు. జనవరి 17, 2024న వివాహం జరిగిందని, సంప్రదాయ పద్ధతిలో తాము ఒక్కటయ్యామని ‘ఇన్‌స్టాగ్రామ్’ వేదికగా తాజాగా ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
భారత్ చేపడుతున్న మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్ మిషన్’లో భాగంగా అంతరిక్షానికి ప్రయాణించనున్నారు నలుగురు వ్యోమగాములు . వీరిలో ఒకరైన కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను తాను పెళ్లి చేసుకున్నట్టు మలయాళ నటి లీనా ప్రకటించారు. జనవరి 17, 2024న వివాహం జరిగిందని, సంప్రదాయ పద్ధతిలో తాము ఒక్కటయ్యామని ‘ఇన్‌స్టాగ్రామ్’ వేదికగా తాజాగా ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 27న దేశ ప్రధాని నరేంద్ర మోదీ భారత వైమానిక దళ పైలట్, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌కు మొదటి భారతీయ వ్యోమగామి ‘వింగ్స్’ను అందజేశారనీ ఈ చారిత్రాత్మక క్షణం దేశానికి, కేరళ రాష్ట్రానికి, వ్యక్తిగతంగా తనకు గర్వించదగింది అని లీలా రాసుకొచ్చారు. అధికారికంగా గోప్యత పాటించాల్సి ఉన్నందున తమ పెళ్లి గురించి ప్రకటించలేదనీ జనవరి 17, 2024న సంప్రదాయ పద్ధతిలో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నామని అందరికీ తెలియజేయడానికి ఈ క్షణం వరకు ఎదురుచూశాననీ ఆమె ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చారు. కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ ది కేరళలోని పాలక్కడ్. నటి లీనా జయరాజ్ పలు సినిమాల్లో నటించారు. ‘స్నేహం’ మూవీ ద్వారా ఆమె మలయాళ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న లీనా తిరిగి ఈ మధ్య పలు పాత్రల్లో నటిస్తున్నారు. ఆమె పలు సీరియల్స్‌లోనూ నటిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

