AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajiv Gandhi Case: రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి సంథాన్‌ కన్నుమూత, శ్రీలంకకు మృతదేహం.!

Rajiv Gandhi Case: రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి సంథాన్‌ కన్నుమూత, శ్రీలంకకు మృతదేహం.!

Anil kumar poka
|

Updated on: Feb 29, 2024 | 6:21 PM

Share

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి సంథాన్ కన్నుమూశాడు. 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించి, సుప్రీంకోర్టు ఆదేశాలతో 2022 నవంబర్​లో విడుదలైన అతడు బుధవారం చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచాడు. కాలేయ వైఫల్యంతో అతడు మరణించినట్లు తెలుస్తోంది. ఉదయం 7.50 గంటలకు అతడు ప్రాణాలు కోల్పోయాడు. 55 ఏళ్ల సంథాన్ అలియాస్ సుథేందిరరాజ శ్రీలంకకు చెందిన వ్యక్తి.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి సంథాన్ కన్నుమూశాడు. 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించి, సుప్రీంకోర్టు ఆదేశాలతో 2022 నవంబర్​లో విడుదలైన అతడు బుధవారం చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచాడు. కాలేయ వైఫల్యంతో అతడు మరణించినట్లు తెలుస్తోంది. ఉదయం 7.50 గంటలకు అతడు ప్రాణాలు కోల్పోయాడు. 55 ఏళ్ల సంథాన్ అలియాస్ సుథేందిరరాజ శ్రీలంకకు చెందిన వ్యక్తి. 1991లో మాజీ ప్రధాని కేసులో దోషిగా తేలిన అతడు 3 దశాబ్దాలకు పైగా శిక్ష అనుభవించాడు. అతడితో పాటు అదే కేసులో శిక్ష అనుభవిస్తున్న మరో ఏడుగురిని సుప్రీంకోర్టు 2022లో విడుదల చేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో తొలుత సంథాన్​కు మరణశిక్ష పడింది. అనంతరం దాన్ని యావజ్జీవ శిక్షగా మార్పు చేశారు. విడుదలైన ఏడుగురు శ్రీలంక దేశస్థులే కావడం, వారి వద్ద పాస్​పోర్ట్​లు, ట్రావెల్ డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల వారిని తిరుచ్చి సెంట్రల్ జైలు ఆవరణలోనే ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసి ఉంచారు. ఇతర దోషులు విదేశాల్లో ఆశ్రయానికి విజ్ఞప్తి చేసుకోగా- తనను శ్రీలంకకు తిరిగి పంపించేలా చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టును సంథాన్ ఆశ్రయించాడు. అక్కడ తన పెద్దమ్మతో కలిసి ఉంటానని విజ్ఞప్తి చేసుకున్నాడు. అయితే, సంథాన్​ను శ్రీలంకకు పంపించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అతడి న్యాయవాది పుగలేంధి తెలిపారు. చికిత్స ఆలస్యం చేయడం వల్లే సంథాన్ మరణించాడని చెప్పారు. సంథాన్ మృతదేహాన్ని అతడి స్వస్థలమైన జాఫ్నాకు చట్టపరంగా తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos