Viral: 20 ఏళ్లుగా కొడుకును చెట్టుకు కట్టేసిన తల్లిదండ్రులు.. ఎందుకంటే.?
గత 20 ఏళ్లుగా ఓ యువకుడిని సంకెళ్లతో చెట్టుకు కట్టి బంధించారు అతడి తల్లిదండ్రులు. మానసిక అనారోగ్యం కారణంగా గత 20 ఏళ్లుగా సంకెళ్లతో జీవిస్తున్నాడు బంగాల్‌కు చెందిన ఓ యువకుడు. అతడికి వైద్యం చేయించే స్థోమత లేక.. అలానే వదిలేస్తే ఎక్కడ పారిపోతాడననే భయంతో తల్లిదండ్రులు గత రెండు దశాబ్దాలుగా ఆ యువకుడిని చెట్టుకు బంధించి ఉంచారు. ఎట్టకేలకు మాల్జా మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా..
గత 20 ఏళ్లుగా ఓ యువకుడిని సంకెళ్లతో చెట్టుకు కట్టి బంధించారు అతడి తల్లిదండ్రులు. మానసిక అనారోగ్యం కారణంగా గత 20 ఏళ్లుగా సంకెళ్లతో జీవిస్తున్నాడు బంగాల్‌కు చెందిన ఓ యువకుడు. అతడికి వైద్యం చేయించే స్థోమత లేక.. అలానే వదిలేస్తే ఎక్కడ పారిపోతాడననే భయంతో తల్లిదండ్రులు గత రెండు దశాబ్దాలుగా ఆ యువకుడిని చెట్టుకు బంధించి ఉంచారు. ఎట్టకేలకు మాల్జా మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా.. యువకుడికి వైద్య సాయం చేస్తామని హామీ ఇవ్వడంతో యువకుడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.మాల్దా జిల్లా బరుయిపర గ్రామానికి చెందిన శివశంకర్ రామ్, సుమేధా దేవి దంపతుల ఐదో కుమారుడు వరుణ్ రామ్ ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ రోజు మధ్యాహ్నం భోజనం చేసి తన తండ్రి దగ్గర పడుకున్నాడు. ఆకస్మాత్తుగా అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అప్పటి నుంచి తన కొడుకు ఇలానే మానసికంగా బాధపడుతున్నాడని వరుణ్ తల్లి చెబుతోంది.
చిన్నప్పుడు వరుణ్ బాగానే ఉండేవాడని ఎనిమిదేళ్ల వయసు నుంచి అతడి ప్రవర్తనలో మార్పు వచ్చిందని తల్లి సుమేధా దేవి తెలిపింది. అప్పటి నుంచి వరుణ్ ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కాలేదనీ వదిలేస్తే పారిపోయేవాడనీ ఇంటి నుంచి తప్పించుకొని ఎక్కడ సరిహద్దు దాటి వెళ్తాడోనని భయంతో చెట్టుకు బంధించి ఉంచుతున్నామని అన్నారు. గతంలో ఒకసారి ఇలానే తప్పిపోయాడనీ అప్పడు వరుణ్ని తిరిగి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపారు. కూలీ పనులు చేసుకునే తమ దగ్గర వరుణ్‌కి వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేక ఇలా గత 20 ఏళ్లుగా బంధించి ఉంచామనీ తాము పనికి వెళ్తే తమ కుమార్తె వరుణ్‌ను చూసుకుంటుందని ఆమె చెప్పుకొచ్చారు. గతంలో వరుణ్‌కి వైద్యం చేయించడానికి ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించలేదని తండ్రి శివశంకర్ రామ్ చెప్పాడు. ఇటీవల మనోజ్ మందల్ అనే పంచాయతీ సభ్యుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా మాల్దా జిల్లా మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా వరుణ్‌కు వైద్యం చేయించేందుకు అవరసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.