Snake Viral Video: ఇంటి సీలింగ్‌లో నక్కిన నాగుపాములు.. భలే పట్టేసిందే ఈ అమ్మాయి.

Snake Viral Video: ఇంటి సీలింగ్‌లో నక్కిన నాగుపాములు.. భలే పట్టేసిందే ఈ అమ్మాయి.

Anil kumar poka

|

Updated on: Aug 23, 2023 | 9:33 PM

వరదల కారణంగా అయితేనేమి, అడవులు తగ్గిపోవడం వల్లనైతేనేమి వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇందులో పాములు ముందు వరుసలో ఉంటున్నాయి. అలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగానే వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంట్లోని సీలింగ్‌లో రెండు పెద్ద పెద్ద పాములు తిష్టవేశాయి. వాటిని ఓ యువతి ఎంతో చాకచక్యంగా పట్టేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

వరదల కారణంగా అయితేనేమి, అడవులు తగ్గిపోవడం వల్లనైతేనేమి వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇందులో పాములు ముందు వరుసలో ఉంటున్నాయి. అలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగానే వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంట్లోని సీలింగ్‌లో రెండు పెద్ద పెద్ద పాములు తిష్టవేశాయి. వాటిని ఓ యువతి ఎంతో చాకచక్యంగా పట్టేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ యువతి ధైర్యానికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి ఎటువంటి భయం లేకుండా ఇంటి పైకప్పు లోపల దాగి ఉన్న రెండు పెద్ద పాములను బయటకు తీసింది. ఆ ఇంట్లోని ఓ రూమ్‌లో పైనుంచి వింత శబ్ధాలు రావడంతో అనుమానం వచ్చి చెక్‌ చేయగా అక్కడ ఓ పెద్ద పాము కనిపించింది. ఆ యువతి ఓ కర్రను తీసుకొని పామును బయటకు లాగి పట్టుకునేలోపు మరో పాము కనిపించింది. ఆ రెండు పాములను ఎంతో ధైర్యంగా, చాకచక్యంగా పట్టుకొంది. ఈ వీడియోను ఓ యూజర్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే 8 లక్షలమందికి పైగా వీక్షించారు. వేలాదిమంది లైక్‌ చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...