Tulip Garden: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లో మన భూతల స్వర్గం.. ఆసియాలోనే అతి పెద్ద తులిప్ గార్డెన్.
ఎన్నెన్నో వర్ణాలు.. అన్నింట్లోనూ అందాలు.. ఇది మనదేశంలోని జమ్ముకశ్మీర్‌లో విరబూసిన తులిప్ పూల ప్రత్యేకత. శ్రీనగర్‌లో ఉన్న ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ అరుదైన ఘనత సాధించింది. జబర్వాన్ పర్వత శ్రేణుల దిగువ భాగంలో ఉన్న ఈ తులిప్ గార్డెన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. 68 రకాలతో కూడిన 1.5 మిలియన్ల తులిప్ పువ్వులతో ఆసియాలో అతిపెద్ద గార్డెన్‌గా ఈ రికార్డు సృష్టించింది.
ఎన్నెన్నో వర్ణాలు.. అన్నింట్లోనూ అందాలు.. ఇది మనదేశంలోని జమ్ముకశ్మీర్‌లో విరబూసిన తులిప్ పూల ప్రత్యేకత. శ్రీనగర్‌లో ఉన్న ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ అరుదైన ఘనత సాధించింది. జబర్వాన్ పర్వత శ్రేణుల దిగువ భాగంలో ఉన్న ఈ తులిప్ గార్డెన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. 68 రకాలతో కూడిన 1.5 మిలియన్ల తులిప్ పువ్వులతో ఆసియాలో అతిపెద్ద గార్డెన్‌గా ఈ రికార్డు సృష్టించింది. ఈ మేరకు ఆగస్టు 19న జరిగిన కార్యక్రమంలో ఫ్లోరికల్చర్, గార్డెన్స్ అండ్ పార్క్స్ కమిషనర్ సెక్రటరీ షేక్ ఫయాజ్ అహ్మద్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షుడు సంతోష్ శుక్లా.. గుర్తింపు పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ దిలీప్ ఎన్ పండిత్, కశ్మీర్ అధికారులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్ పుష్పాల ఉద్యానవనాలు ఉన్నాయి. 30 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ మాత్రం ఆసియా ఖండంలోనే అతిపెద్దది. ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ గొప్పతనాన్ని గుర్తించినందుకు వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ బృందానికి కమిషనర్ సెక్రటరీ షేక్ ఫయాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక చరిత్రాత్మక విజయంగా వర్ణించారు. కాశ్మీర్లో పూల సంపద.. స్థానికంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని వివరించారు. శ్రీనగర్‌లోని ప్రకృతి అందాలకు కేరాఫ్‌గా ఉంటుంది ఈ తులిప్ తోట. ఈ భూలోక స్వర్గాన్ని చూసేందుకు ఏటా లక్షల మంది పర్యాటకులు శ్రీనగర్‌కు తరలివస్తుంటారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

