పెట్రోల్ కొట్టించేందుకు బైక్‌తో బంక్‌కు.. అంతలోనే వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా !!
పుట్టల్లోనో... పొదల్లోనో...ఉండాల్సిన పాములు ఈ మధ్య బైకులు, కార్లువంటి వాహనాల్లో దూరి కలకలం సృష్టిస్తున్నాయి. ఎండవేడికి చెట్టుకింద పార్కింగ్ చేసిన వాహనాల్లోకి చొరబడి హడలెత్తిస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పలాస మున్సిపాలిటీ పద్మనాభపురం సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఓ పాము కలకలం సృష్టించింది. ఓ బైక్ లో సడన్ గా ప్రత్యక్షమై అందరినీ భయపెట్టింది. వాసుదేవరావు అనే కానిస్టేబుల్ తన బైక్ కు పెట్రోల్ కొట్టించేoదుకు పెట్రోల్ బంక్ కి వచ్చాడు.
పుట్టల్లోనో… పొదల్లోనో…ఉండాల్సిన పాములు ఈ మధ్య బైకులు, కార్లువంటి వాహనాల్లో దూరి కలకలం సృష్టిస్తున్నాయి. ఎండవేడికి చెట్టుకింద పార్కింగ్ చేసిన వాహనాల్లోకి చొరబడి హడలెత్తిస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పలాస మున్సిపాలిటీ పద్మనాభపురం సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఓ పాము కలకలం సృష్టించింది. ఓ బైక్ లో సడన్ గా ప్రత్యక్షమై అందరినీ భయపెట్టింది. వాసుదేవరావు అనే కానిస్టేబుల్ తన బైక్ కు పెట్రోల్ కొట్టించేoదుకు పెట్రోల్ బంక్ కి వచ్చాడు. బండి ఇంజన్ ఆపి పెట్రోల్ ట్యాంక్ కీ ఓపెన్ చేస్తుండగా…పాము కనిపించింది. బైక్ లోకి ఎలా దూరిందో తెలియదు కానీ బైక్ ముందు భాగంలో డూమ్ వద్ద వైర్ల మద్య తిష్ట వేసింది. నల్లని చారలతో నెమ్మదిగా కదులుతూ కనిపించిన పామును చూసి వాసుదేవరావు ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. వెంటనే బైక్ ను అక్కడే వదిలి దూరంగా పరుగులు పెట్టాడు. ఇది గమనించిన స్తానికులలో ఒకరు ధైర్యం చేసి బైక్ దగ్గరకు వెళ్ళి కర్రతో శబ్ధం చేస్తూ పాముని బయటకు తోలే ప్రయత్నం చేశాడు. కాసేపు బైక్ సందుల్లో అటు ఇటూ తిరిగి నెమ్మదిగా బైక్ లో నుండి జారుకుంది పాము. అందరూ చూస్తుండగానే పొదల్లోకి వెళ్లింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పెట్రోల్ బంకుకి వచ్చే ముందు బైక్ ని ఓ ఖాళీ స్థలంలో చెట్టు నీడన ఉంచానని…అక్కడే పాము బైక్ లోకి చొరబడి ఉంటుందని వాసుదేవరావు అన్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భర్త విఘ్నేశ్ ను అన్ ఫాలో చేసిన నయన్.. పొరపాటా ?? సాంకేతిక తప్పిదమా ??
కునుకు తీసిన ఉపాసన.. కాళ్లు నొక్కిన మెగా హీరో
100 కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నా.. సొంత సినిమాలలో నష్టపోయినట్లు సినీ నటి
బ్లాక్ ఔట్‌ఫిట్స్‌లో సెలబ్రిటీల సందడి.. జోరుగా అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుక
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

