షార్క్‌ చేపతో ఓవరాక్షన్‌.. చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది

షార్క్‌ చేపతో ఓవరాక్షన్‌.. చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది

Phani CH

|

Updated on: Jul 24, 2022 | 9:57 PM

కొన్ని జంతువులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచింది. ఓవరాక్షన్‌కు పోయి ఎక్స్‌ట్రాలు చేస్తే ప్రాణాలు పోవచ్చు లేకపోతే గాయాలైనా కావచ్చు.

కొన్ని జంతువులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచింది. ఓవరాక్షన్‌కు పోయి ఎక్స్‌ట్రాలు చేస్తే ప్రాణాలు పోవచ్చు లేకపోతే గాయాలైనా కావచ్చు. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, సముద్రంలోని ఓ పడవలో ఒక ఫ్యామిలీ పర్యటిస్తోంది. ఈ క్రమంలో సముద్రంలో ఓ చిన్న సొరచేపను నీటిలో వదిలే క్రమంలో ఓ వ్యక్తి ఓవర్‌గా బిహేవ్‌ చేశాడు. చేపను గట్టిగా నీటిలో అటు ఇటు తిప్పాడు. దీంతో, తిక్కరేగింది సొర చేపకు.. కోపం వచ్చి అతడిని నోటితో గాయపరిచింది. అతడి చేతిని షార్క్‌ కొరికే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అతడి వేలుకు తీవ్రగాయమైంది. చేతి నుంచి రక్తం కారడం వీడియోలో చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. అతడు మరోసారి ఈ తప్పు చేయడు అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దొంగల ముఠానే హడలెత్తించిన ఓ పెద్దాయన.. దెబ్బకు తోకముడిచిన గ్యాంగ్‌

నగర రోడ్లపై గుర్రంపై దూసుకుపోతున్న డాగీ !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

RX 100: ఆర్‌ఎక్స్‌ 100 బైక్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌

Leh Airport: విమానం టేకాఫ్‌ అవకుండా అడ్డుకున్న కుక్క.. చివరికి ఏమైందంటే ??

Gay Marriages: గే పెళ్లిళ్లకు గ్రీన్ సిగ్నల్.. నిరసనలు, అరెస్టుల మధ్యే

 

Published on: Jul 24, 2022 09:57 PM