300 మీటర్ల నుంచి జాలువారే జలపాతం.. చెన్నై ఎక్స్ ప్రెస్ లో ఆ సీన్ తీసింది ఇక్కడే
పెద్ద పెద్ద కొండల మధ్య నుంచి జాలువారుతున్న నీళ్లు.. అచ్చం పాలలా కనిపిస్తాయి. దాదాపు 310 మీటర్ల ఎత్తు నుంచి నీళ్లు అక్కడ జాలువారుతుంటాయి.
పెద్ద పెద్ద కొండల మధ్య నుంచి జాలువారుతున్న నీళ్లు.. అచ్చం పాలలా కనిపిస్తాయి. దాదాపు 310 మీటర్ల ఎత్తు నుంచి నీళ్లు అక్కడ జాలువారుతుంటాయి. నురగలు కక్కుకుంటూ జలజలా జారుతూ పారే నీటిని చూస్తూ మైమరిచిపోవాల్సిందే. గోవాలో ఉంది ఈ అద్భుత దూత్‌సాగర్ జలపాతం. వర్షాకాలంలో ఇది మరింత అద్భుతంగా కనువిందు చేస్తుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ రమేష్ పాండే వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారిపోయింది. గోవా, కర్ణాటక సరిహద్దు మన్ డోవి నది పైన ఉంది ఈ దూద్ సాగర్ జలపాతం. ఈ జలపాతానికి చేరుకోవాలంటే గోవా రాజధాని పనాజి నుంచి 60 కిలోమీటర్ల ప్రయాణించాలి. ఇక ఈ జలపాతం పారుతున్న కొండల మధ్యలో నుంచి రైల్వే ట్రాక్ ఉంటుంది. ట్రెయిన్ లో ప్రయాణిస్తూ దూద్ సాగర్ వాటర్‌ఫాల్‌ను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. షారుఖ్, దీపికా నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో ఇక్కడే ఓ సీన్ ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షార్క్ చేపతో ఓవరాక్షన్.. చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది
దొంగల ముఠానే హడలెత్తించిన ఓ పెద్దాయన.. దెబ్బకు తోకముడిచిన గ్యాంగ్
నగర రోడ్లపై గుర్రంపై దూసుకుపోతున్న డాగీ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
RX 100: ఆర్‌ఎక్స్ 100 బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్
Leh Airport: విమానం టేకాఫ్ అవకుండా అడ్డుకున్న కుక్క.. చివరికి ఏమైందంటే ??