నగర రోడ్లపై గుర్రంపై దూసుకుపోతున్న డాగీ !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

నగర రోడ్లపై గుర్రంపై దూసుకుపోతున్న డాగీ !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Phani CH

|

Updated on: Jul 24, 2022 | 9:54 PM

హార్స్ రైడింగ్‌ మీరే కాదు.. మేమూ చేస్తామంటూ సవాలు విసురుతోంది ఓ కుక్కపిల్ల. అంతేకాదు.. గుర్రమెక్కి నగర రోడ్లపై కౌబాయ్‌లా దూసుకుపోయింది కూడా.

హార్స్ రైడింగ్‌ మీరే కాదు.. మేమూ చేస్తామంటూ సవాలు విసురుతోంది ఓ కుక్కపిల్ల. అంతేకాదు.. గుర్రమెక్కి నగర రోడ్లపై కౌబాయ్‌లా దూసుకుపోయింది కూడా. ఈ అసాధారణ దృశ్యం నెటిజన్లకు కెనడియన్ టీవీ సిరీస్ ప్రముఖ కార్టూన్ పా పెట్రోల్‌ను గుర్తు చేసింది. అదే సమయంలో దీనిని ఇండియ‌న్ నెటిజ‌న్లు మ‌జ్నూభాయ్ సినిమాలో హీరో అనిల్‌క‌పూర్ గీసిన గుర్రంపై గాడిద పెయింటింగ్‌తో పోల్చారు. ప్రస్తుతం ఈ గుర్రపు స్వారీ చేస్తున్న కుక్కపిల్ల వీడియో ఆన్‌లైన్‌లో చ‌క్కర్లు కొడుతుంది. ఈ వీడియోను ట్విట‌ర్‌లో అప్‌లోడ్ చేశారు. న‌గ‌ర రోడ్లపై ప‌రుగెత్తుతున్న గుర్రంపై కుక్కపిల్ల ద‌ర్జాగా నిల్చుని ఉంటుంది. సిగ్నల్ ప‌డిన‌ప్పుడు అవి ఆగిపోయాయి. గ్రీన్‌లైట్ ప‌డ‌గానే గుర్రం మ‌ళ్లీ ప‌రుగెత్తడం ప్రారంభించింది. ఈ వీడియోను లక్షలమంది వీక్షిస్తుండగా వేలల్లో లైక్‌ చేస్తున్నారు. అంతేకాదు తమదైన శైలిలో కామెంట్లతో హోరిత్తిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

RX 100: ఆర్‌ఎక్స్‌ 100 బైక్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌

Leh Airport: విమానం టేకాఫ్‌ అవకుండా అడ్డుకున్న కుక్క.. చివరికి ఏమైందంటే ??

Gay Marriages: గే పెళ్లిళ్లకు గ్రీన్ సిగ్నల్.. నిరసనలు, అరెస్టుల మధ్యే

Vijay Deverakonda: ‘ఆ ఫైట్‌ గురించి తెలిసి మా అమ్మ భయపడింది’

Samantha: ఆ ఒక్క మాటతో.. నాగచైతన్య లెక్క ఖతం చేసిన సామ్

 

Published on: Jul 24, 2022 09:54 PM