AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెల్ఫీ డెత్‌ రేటింగ్‌లో ఇండియా టాప్‌

సెల్ఫీ డెత్‌ రేటింగ్‌లో ఇండియా టాప్‌

Phani CH
|

Updated on: Aug 30, 2025 | 1:10 PM

Share

ఇప్పుడంతా సోషల్‌ మీడియా యుగం నడుస్తోంది. సోషల్‌ మీడియా ద్వారా అనామకులు కూడా రాత్రికి రాత్రి ఫేమస్‌ అయిపోయిన సంఘటనలు ఉన్నాయి. దీంతో ప్రతిఒక్కరు సెల్ఫీలు, రీల్స్‌, ప్రాంక్‌ వీడియోస్‌ వెంట పరిగెడుతున్నారు. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏం చేసినా సోషల్‌ మీడియలో పోస్ట్‌ చేయడం పరిపాటిగా మారింది.

కొత్త డ్రెస్‌ వేసుకున్న సెల్ఫీ.. కొత్తగా ఎక్కడికైనా వెళ్లినా సెల్ఫీ.. కూర్చున్నా సెల్ఫీ.. నిల్చున్నా సెల్ఫీ.. తింటున్నా సెల్ఫీ.. పడుకున్నా సెల్ఫీ.. ఇలా తయారైంది. ఈ క్రమంలో ప్రమాదకర స్టంట్స్‌ వేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా సెల్ఫీలు దిగుతూ మరణించిన సంఘటనల్లో ప్రపంచంలోనే ఇండియా టాప్‌లో ఉందట. ఇటీవల గ్లోబల్ సెల్ఫీ డెత్స్ లిస్ట్ రిలీజ్ అయింది. ఆ లిస్ట్‌ ప్రకారం ఇండియా టాప్‌లో ఉంది. మార్చి 2014 నుంచి మే 2025 వరకు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగు చూశాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన వందశాతం మరణాల్లో ఇండియా ఏకంగా 42.1% షేర్‌తో అగ్రస్థానంలో ఉంది. సెల్ఫీ తీసుకుంటూ ఎత్తైన ప్రదేశాల నుంచి పడిపోతూ అనేక మంది మృతి చెందారు. రాళ్లు, భవనాల పైనుండి పడడం, నీళ్లలో మునిగిపోవడం, రైలు ప్రమాదాలు చోటు చేసుకోవడం వంటివి సెల్ఫీ మరణాల్లో ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక ఇండియా తర్వాత యునైటెడ్ స్టేట్స్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత రష్యా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా వరుస స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇండియాలో పలు డేంజర్‌ స్పాట్‌లను సెల్ఫీ నిషేధిత జోన్లుగా ప్రకటించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ పత్రిక పేరునే.. తెలుగుదేశం పార్టీకి పెట్టారా?

ఐఫోన్‌ తయారీలో కుప్పం ముద్ర

హైదరాబాద్‌లో బీచ్.. సముద్ర తీరాన్ని తలదన్నేలా ఏర్పాట్లు

ప్రపంచంలోనే రిచ్చెస్ట్ బెగ్గర్ ఏడాది సంపాదన ఎంతో తెలుసా?

Tribanadhari Barbarik: త్రిబాణధారి బార్బరిక్.. హిట్టా..? ఫట్టా..?