AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో బీచ్.. సముద్ర తీరాన్ని తలదన్నేలా ఏర్పాట్లు

హైదరాబాద్‌లో బీచ్.. సముద్ర తీరాన్ని తలదన్నేలా ఏర్పాట్లు

Phani CH
|

Updated on: Aug 30, 2025 | 12:59 PM

Share

విశ్వనగరం వైపు శరవేగంగా అభివృద్ధి బాటలో పరుగులు పెడుతున్న హైదరాబాద్‌కు ఇన్నాళ్లు ఒకే ఒక్క వెలితి వేధిస్తుండేది. అదే బీచ్‌.. హైదరాబాద్‌కు బీచ్‌ లేకపాయే అని నగరవాసులు ఇప్పటికీ తెగ బాధపడిపోతుంటారు. సముద్ర తీర ప్రాంతం అంటేనే మనసుకు ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అలలతో ఆడుకోవడం, ఇసుక తిన్నెలపై వాకింగ్‌, బీచ్‌ ఒడ్డున సన్‌ బాత్‌ ఇలా బీచ్‌కు ఉండే స్పెషాలిటీయే వేరు.

విశ్వనగరం వైపు శరవేగంగా అభివృద్ధి బాటలో పరుగులు పెడుతున్న హైదరాబాద్‌కు ఇన్నాళ్లు ఒకే ఒక్క వెలితి వేధిస్తుండేది. అదే బీచ్‌.. హైదరాబాద్‌కు బీచ్‌ లేకపాయే అని నగరవాసులు ఇప్పటికీ తెగ బాధపడిపోతుంటారు. సముద్ర తీర ప్రాంతం అంటేనే మనసుకు ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అలలతో ఆడుకోవడం, ఇసుక తిన్నెలపై వాకింగ్‌, బీచ్‌ ఒడ్డున సన్‌ బాత్‌ ఇలా బీచ్‌కు ఉండే స్పెషాలిటీయే వేరు. అదో ప్రత్యేక అనుభూతి. అందుకే భాగ్యనగరవాసులు తరచుగా గోవా, కేరళ, విశాఖపట్నం వంటి సముద్ర తీర ప్రాంతాలకు టూర్‌ వేస్తూ ఉంటారు. ఇక డబ్బులున్న వారు విదేశాల బీచ్‌లను కూడా సందర్శిస్తుంటారు. అయితే తెలంగాణ వచ్చిన కొత్తలో నాటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌కు బీచ్‌ను తీసుకొస్తామంటే అంతా నవ్వుకున్నారు. సముద్రమే లేని చోట బీచ్‌ ఎలా సాధ్యమంటూ ఎగతాళి కూడా చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో బీచ్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తుండటం మరింత ఆసక్తిగా మారింది. ఆర్టిఫిషియ‌ల్ బీచ్‌ను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంది. ఈ క్ర‌మంలోనే నగర శివారులోని కొత్వాల్‌గూడలో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారు 35 ఎకరాల్లో రూ.225కోట్ల వ్యయంతో డిసెంబర్ నుంచి దీని నిర్మాణం మొదలుకానున్నట్లు సమాచారం. బీచ్‌లో ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటళ్లు, వేవ్ పూల్స్, థియేటర్లు, ఫుడ్ కోర్టులు వంటివి చేర్చనున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ పద్ధతిలో ఈ నిర్మాణ పనులు డిసెంబర్, 2025 నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్టిఫిషియల్‌ బీచ్ పర్యాటకులకు మాత్రమే కాకుండా.. నగరవాసులకు వారాంతపు వినోదానికి కేంద్రంగా మారబోతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే రిచ్చెస్ట్ బెగ్గర్ ఏడాది సంపాదన ఎంతో తెలుసా?

Tribanadhari Barbarik: త్రిబాణధారి బార్బరిక్.. హిట్టా..? ఫట్టా..?

Bullet Train: ఏపీలో బుల్లెట్‌ రైలు పరుగులు