Watch: కుప్పంకి చేరిన కృష్ణా నీటికి చంద్రబాబు జలహారతి
తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా నీరు కుప్పం నియోజకవర్గానికి చేరడం తెలిసిందే. ఈ సందర్భంగా కుప్పంలో జరిగిన జలహారతి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కృష్ణా నీటికి హారతి ఇచ్చారు.
తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. హంద్రీనీవా ద్వారా కుప్పంకి చేరిన కృష్ణా నీటికి చంద్రబాబు జలహారతి ఇచ్చారు. హంద్రీనీవా సుజల స్రవంతి పైలాన్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. శ్రీశైలం నుంచి 738 కిలో మీటర్లు ప్రయాణించిన కృష్ణమ్మ కుప్పంకు చేరింది. హంద్రీనీవా కాల్వల విస్తరణ పనుల ద్వారా కుప్పం చివరి భూములకు కృష్ణా నదీ జలాలు చేరాయి. ఈ సందర్భంగా వేద మంత్రోచ్ఛారణల మధ్య కృష్ణమ్మకు పసుపు, కుంకమ సమర్పించి చంద్రబాబు జలహారతినిచ్చారు. శనివారం సాయంత్రం కుప్పం పర్యటనను ముగించుకొని బెంగుళూరు విమానాశ్రయానికి సిఎం చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు.
Published on: Aug 30, 2025 01:05 PM
వైరల్ వీడియోలు
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

