ఆ పత్రిక పేరునే.. తెలుగుదేశం పార్టీకి పెట్టారా?
తెలుగు దేశం పార్టీ ఆవిర్బావం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశ రాజకీయ యవనికపై అదో ప్రభంజనం. సీని రంగంలో అగ్ర నటుడు నందమూరి తారకరామారావు రాజకీయ పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టడం నేటికీ భారతదేశంలో సంచలన రికార్డుగానే మిగిలింది. దాదాపు మూడు దశాబ్దాలుగా పాతుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలిస్తూ.. టీడీపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది.
1983 జనవరి 5న జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన ఆ రోజు దేశ రాజకీయ చరిత్రలో చెరిగిపోని చిత్రం. అయితే ఇదంతా ఎలా ఉన్నా.. ఎన్టీఆర్ పెట్టే రాజకీయ పార్టీకి ఎలా బీజం పడింది..? ‘తెలుగుదేశం’ పేరును సూచించింది ఎవరు..? అనే చర్చ ఇటీవల రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. రాజకీయ పార్టీ పెట్టాలనుకున్న ఎన్టీఆర్‌కు పార్టీ పేరు సూచించింది ఈనాడు గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత రామోజీ రావేనట. అప్పటికే రాష్ట్రంలో ‘తెలుగుదేశం’ పేరుతో తెలుగు వార పత్రిక కొనసాగుతోంది. ఆ పత్రిక ఎడిటర్ కృష్ణా జిల్లా వీరులపాడుకు చెందిన సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ. 1949లోనే ఒక మహిళ పత్రికా సంపాదకురాలు స్థాయికి ఎదిగడం అసాధారణ విషయమే. సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మతో రామోజీరావు సంప్రదింపులు జరిపి ఆమె అనుమతితో ‘తెలుగుదేశం’ పేరును పార్టీకి ఖరారు చేశారు. ఆ తర్వాత అదే పేరు తెలుగు జాతి గౌరవం, ఔన్నత్యాన్ని నిలిపేదిగా నిలిచింది. ప్రపంచం నలుమూలలా తెలుగోడి సత్తాని వెలుగెత్తి చాటింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైదరాబాద్‌లో బీచ్.. సముద్ర తీరాన్ని తలదన్నేలా ఏర్పాట్లు
ప్రపంచంలోనే రిచ్చెస్ట్ బెగ్గర్ ఏడాది సంపాదన ఎంతో తెలుసా?
Tribanadhari Barbarik: త్రిబాణధారి బార్బరిక్.. హిట్టా..? ఫట్టా..?
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

