ప్రపంచంలోనే రిచ్చెస్ట్ బెగ్గర్ ఏడాది సంపాదన ఎంతో తెలుసా?
దేశంలో నిరుద్యోగ సమస్య ఆకాశాన్ని అంటుతోంది. డిగ్రీలు, పీజీలు చేసిన యువతలో అనేకులు రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నారు. ఇంకొందరు చదివిన చదువుకు సంబంధం లేని చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ రాజీపడి జీవితాలను నెట్టుకొస్తున్నారు. ఇంట్లో ఉండే నలుగురూ ఏదో ఒక పని చేసి నాలుగు రూపాయలు తెస్తే తప్ప.. ఆ కుటుంబానికి రోజు గడవని పరిస్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో.. ముంబైలోని ఓ సాదాసీదా వ్యక్తి ఏటా రూ.7.5 కోట్లు సంపాదిస్తూ అందరిచేతా ‘ఔరా’ అనిపించుకుంటున్నాడు. మన దేశంలోని అనేక కార్పొరేట్ కంపెనీల అధిపతులు ఏటా తీసుకునే వేతనాల కంటే ఇది ఎక్కువ కావటం విశేషం. ఇంతకీ ఆ వ్యక్తి ఆదాయమార్గం ఏమిటో తెలుసా?.. బిచ్చమెత్తుకోవటం. యస్.. మీరు వింటున్నది నిజమే. ఈ బిచ్చగాడు రోడ్డు మీద అడుక్కుంటూ ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నాడు. అంతేకాదు.. మనోడు ప్రపంచంలోనే సంపన్న బిచ్చగాడిగానూ రికార్డుకెక్కాడు. ఇక.. మనం మాట్లాడుకుంటున్న ఈ బిచ్చగాడి పేరు.. భరత్ జైన్. పేద కుటుంబంలో పుట్టిన జైన్ ఆకలికి తాళలేక భిక్షాటనను వృత్తిగా మలచుకున్నాడు. దాదాపు 40 సంవత్సరాల నుంచి ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తున్నాడు. రోజుకు రూ.2,000 నుండి రూ.2,500 వరకు సంపాదిస్తున్నాడు. తాను సంపాదించిన డబ్బును వృధా చేయకుండా.. ఎప్పటికప్పుడు తెలివిగా మదుపు చేసి..అనేక ఆస్తులను కొనుగోలు చేశాడు. తన ఇద్దరు కొడుకులనూ ప్రఖ్యాత స్కూళ్లలో చదివించటమే గాక..ఆలయాలు, దాతృత్వ సంస్థలకు విరాళాలు కూడా ఇస్తున్నాడు. జీవితంలో బాగా స్థిరపడినా.. మనోడు మాత్రం భిక్షాటనను వదులుకోవడం లేదు. అంతేకాదు.. ఈ భరత్ సింగ్ టెక్నాలజీని సైతం అందిపుచ్చుకుంటున్నాడు. గతంలో వాడే బొచ్చ పక్కనపారేసి.. ఏకంగా యూపీఐ స్కానర్లు పట్టుకుని మరీ అడ్డుక్కుంటున్నాడు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ఆజాద్ మైదాన్ ప్రాంతాల్లో భరత్ భిక్షాటన చేస్తూ కనిపిస్తాడు. 40 సంవత్సరాల పాటు ఈ వృత్తిలో కొనసాగిన భరత్.. ముంబైలోనే తన పిల్లల కోసం రూ. 1.4 కోట్ల విలువైన ఫ్లాట్లు, నెలకు రూ. 30 వేలు అద్దె వచ్చే రెండు షాపులు కూడా కొన్నాడంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tribanadhari Barbarik: త్రిబాణధారి బార్బరిక్.. హిట్టా..? ఫట్టా..?
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

