తీవ్ర విషాదం.. గూగుల్ మ్యాప్ ఎంత పని చేసిందంటే వీడియో
గూగుల్ మ్యాప్.. దీనిని గుడ్డిగా నమ్మితే ఎంతటి ప్రమాదాలు సంభవిస్తాయో ఈ ఘటన మరోసారి రుజువు చేస్తోంది. ప్రస్తుత కాలంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఎవరినీ అడిగే అవసరం లేకుండా గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఎంతదూరమైనా ప్రయాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎందరో ప్రమాదాల్లో చిక్కుకున్న ఘటనలు నెట్టింట చూశాం. తాజాగా రాజస్థాన్‌లో అలాంటి ఘటనే జరిగింది. గూగుల్ మ్యాప్ చూపిన మార్గంలో వెళ్లి 9 మంది ప్రమాదంలో చిక్కుకున్నారు. ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురు గల్లంతయ్యారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని చిత్తోర్‌గఢ్ జిల్లా, రష్మి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రాజ్‌సమంద్ జిల్లాకు చెందిన గదరి వర్గానికి చెందిన కుటుంబం విహార యాత్ర కోసం భిల్వారాలోని సవాయి భోజ్‌ను సందర్శించింది. తిరుగు ప్రయాణంలో గూగుల్ మ్యాప్‌లో చూపిన మార్గాన్ని అనుసరించడంతో వారు సోమి–ఉప్రెడా మధ్యనున్న కల్వర్ట్ వద్దకు చేరుకున్నారు. అయితే, ఈ కల్వర్ట్ గత మూడు సంవత్సరాలుగా మూసేసి ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా బనాస్ నదికి పోటెత్తిన నీరు ఆ మార్గాన్ని కప్పివేసింది. ఈ విషయం తెలియని డ్రైవర్ వ్యాన్‌ను కల్వర్ట్ పైకి తీసుకెళ్లగా, వేగంగా వచ్చిన ప్రవాహానికి వ్యాన్ కొట్టుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్తులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పడవల సహాయంతో ఐదుగురిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే, ఈ ఘటనలో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
దారుణం.. పెళ్లయిన మూడు నెలలకే భార్యను చంపి..ప్రియురాలితో వీడియో
ఇక శ్వాస పరీక్ష ద్వారా.. మధుమేహం గుట్టు రట్టు వీడియో
ఆలస్యంగా తల్లి కావాలనుకునే వారికి ఇది వరం.. వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
