Viral Video: సృష్టిలో ఒకొక్క ప్రాణికి ఒకొక్క ఆహార నియమం ఉంది. అవి తమ ఆహారాన్ని సంపాదించుకోవడానికి కూడా విలక్షణ పద్దతులను అనుసరిస్తాయి. ఒకొక్క జీవి ఒకొక్క స్టైల్ లో తినే ఆహారాన్ని సంపాదించుకుంటుంది. అది ప్రకృతి ఏర్పరచిన ధర్మం. అలా డిఫరెంట్ గా తన ఆహారాన్ని సంపాదించుకునే జీవుల్లో ఒకటి కప్ప. నెల మీద, నీటిలోనే నివసించే ఈ ఉభయ చరం.. ఆహారం సంపాదించుకోవడానికి ఒక చోట స్థిరంగా ఉంటుంది. తన చుట్టూ చేరే క్రిమికీటలను తన నాలికతో అందుకుని గుటుక్కుమనిపిస్తుంది. ఇలా ఆహార సంపాదన వేటలో కప్పకు బాగా ఉపకరించే సాధనం దాని పొడవైన నాలుక.
కప్పు తన చుట్టూ గాల్లో తిరిగే పురుగులు, కీటకాలను నాలుకతో లాక్కొని మింగేస్తుంది. అలా ఆహారం తీసుకునే క్రమంలో నాలుక పొడవుగా సాగి ఉపకరిస్తుంది. అయితే ఓ కప్పకు తన నాలుకే శాపమై తనలో పదవ వంతు కూడా లేని ఓ పురుగుకి చిక్కింది. తననే ఎగరేసుకుపోయేలా చేసింది. ప్రకృతి లో అరుదుగా జరిగే దృశ్యాలను ఫారెస్ట్ అధికారి సుశాంత్ నందా తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తారు. అయన షేర్ చేసే అరుదైన వీడియోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటాయి. అటువంటి వీడియో ఒకటి ప్రస్తుతం ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.
ఓ కప్ప స్థిరంగా కూర్చుని తనవైపు వచ్చిన పురుగులను నాలుకతో కరచుకొని తింటుంది. అలానే ఓ కందిరీగ కూడా కప్ప దగ్గరకు రావడంతో దాన్ని కూడా కప్ప నాలుకకు కరుచుకుంది. అయితే ఆ కందిరీగను పూర్తి స్థాయిలో నోట్లోకి లాక్కోలేకపోయింది. దీంతో ఆ కందిరీగ కు బలం వచ్చింది. విప్పిన రెక్కలతో బలంగా ఎగడానికి ప్రయత్నించింది. కప్పు కదలడంతో కందిరీగ తెలివిగా మరికాస్త స్పీడుగా వాటిని ఆడించసాగింది. అంతే కప్ప కూడా కందిరీగతో గాల్లోకి ఎగిరింది. కప్ప నాలుకతో లాగేసుకున్నప్పుడే వెంటనే నోట్లోకి తీసుకుంటుంది. కానీ.. కాస్త ఆలస్యమవడంతో కందిరీగ తన ప్రతాపం చూపించింది. ఫలితంగా తనకంటే చాలా బరువైన కప్పను కూడా ఆ కందిరీగ గాల్లో ఎగరేసుకుపోయింది.
When fly extracts revenge??
Via Fred Schultz pic.twitter.com/OlIQ505HgC
— Susanta Nanda IFS (@susantananda3) June 27, 2021