నడి సముద్రంలో పక్షులకు ఆహారం వేస్తున్న వ్యక్తి.. ఆమాంతం పైకి వచ్చేసిన నీటి సింహం.. చివరికి..
ఇటీవల కాలంలో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కొన్ని వీడియోలలో అవి చేసే పనులను చూస్తుంటే ముచ్చటెస్తుంది
ఇటీవల కాలంలో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కొన్ని వీడియోలలో అవి చేసే పనులను చూస్తుంటే ముచ్చటెస్తుంది. మరికొన్ని భయంకరంగానూ ఉంటాయి. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాల్ హాల్ చల్ చేస్తోంది.
ఒక వ్యక్తి సముద్రం మధ్యలో పడవలో వెళ్తూ.. అక్కడి పక్షులకు చేపలను ఆహారంగా వేస్తున్నాడు. ఇక ఆ వ్యక్తిని అనుసరించి.. చాలా పక్షులు ఆ పడవ దగ్గరకు రావడం ప్రారంభించాయి. ఇలా వేస్తున్నదంతా.. ఎప్పటి నుంచో గమనించిన నీటి సింహం… ఆకస్మాత్తుగా పడవ పైకి వచ్చేసింది. అక్కడే ఉన్న చేపలను ఒక్కోక్కటిగా తింటూ.. చివరకు పూర్తిగా పడవపైకి ఎక్కేసింది. ఇక దానిని తరమడానికి అక్కడున్న వారి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా.. అది మాత్రం చేపలను తినడంలో ఫుల్ బిజీ అయిపోయింది. పక్షుల కోసం పెట్టిన ఆహారాన్ని మొత్తం తీనేసాక.. ఆ నీటి సింహం మళ్ళీ సముద్రంలోకి వెళ్ళింది. ఈ వీడియోను టామ్ బోడిల్ అనే ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో షేర్ చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియోకు 9.9m వ్యూస్ రాగా.. 7000 కామెంట్స్ వచ్చాయి. 26.4 కే లైక్స్ వచ్చాయి. ఇది చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మరీ ఆ వీడియోను మీరు ఓ లుక్కేయ్యండి.
ట్వీట్..
? An absolutely outstanding performance. Worth watching to the end. pic.twitter.com/784GSCJUvh
— Tom Boadle (@TomBoadle) March 18, 2021
Also Read: Holi Festival: హోలీ పండుగ కోసం సిద్ధమవుతున్నారా ? నిపుణుల సూచనలు బ్యూటీ టిప్స్ ఇవే..\
Summer Diet Tips : ఎండ నుంచి ఉపశమనం కోసం .. ఈ ఐదింటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి..
ఏప్రిల్ 1 నుంచి బాదుడే.. బాదుడు.. వీటి ధరలు భారీగా పెరగనున్నాయి…కొనాలంటే ఇప్పుడే కొనేయండి..!