salary 286 times: శాలరీ డబ్బు కోసం ఏటీఎంకు వెళ్లిన వ్యక్తి.. బ్యాలెన్స్ చెక్ చేయగా షాక్.. కట్ చేస్తే..!
అతనొక చిరు ఉద్యోగి.. నెలనెలా తనకొచ్చే జీతంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తాజాగా తనకొచ్చిన జీతం డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లాడు. అనంతరం బ్యాలెన్స్ చెక్ చేయగా..
అతనొక చిరు ఉద్యోగి.. నెలనెలా తనకొచ్చే జీతంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తాజాగా తనకొచ్చిన జీతం డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లాడు. అనంతరం బ్యాలెన్స్ చెక్ చేయగా.. స్క్రీన్‌పై దర్శనమిచ్చిన అమౌంట్ చూసి కళ్లు తేలేశాడు.. వివరాల్లోకి వెళ్తే.. చిలీ దేశంలోని ఓ ప్రముఖ మైనింగ్ సంస్థలో ఉద్యోగి 43 వేల రూపాయల జీతానికి పని చేస్తున్నాడు. అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో సాఫ్ట్‌వేర్ సమస్య వల్ల అతడి ఖాతాలోకి ఏకంగా 286 రెట్లు ఎక్కువగా.. అంటే సుమారు 1.42 కోట్లు జమ అయ్యాయి. తన అకౌంట్‌లో అంత డబ్బు చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు సదరు వ్యక్తి. సీన్ కట్ చేస్తే..సదరు వ్యక్తికి అంత డబ్బు చూశాక.. ఓ ప్లాన్ తట్టింది. ఆ డబ్బు మొత్తాన్ని విత్‌డ్రా చేశాడు. ఆఫీస్‌కు తన రాజీనామా లేఖను పంపించాడు.. గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రే ఊరు వదిలివెళ్ళాడు. అటు అకౌంట్స్ సిబ్బంది జరిగిన తప్పిదాన్ని గుర్తించి.. ఉద్యోగిని సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే ఈలోపే జరగాల్సిందంతా జరిగిపోయింది. కాగా, ఆ డబ్బుతో ఉద్యోగి ఉడాయించడంతో.. కంపెనీ అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. చూడాలి మరి.. చివరికి ఆ సొమ్ము కంపెనీ దక్కించుకుంటుందో.? లేదో.?
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

