తాజ్ హోటల్లో వీధి కుక్క.. రతన్ టాటా ప్రేమకు నెటిజన్లు ఫిదా
ముంబైలోని ప్రతిష్టాత్మక తాజ్ మహల్ హోటల్‌లో బస చేయడానికి సంపన్నులే అతిథులుగా వస్తుంటారు. హోటల్ నిర్మాణంలో కూడా అడుగడుగునా రాజసం ఉట్టిపడుతుంది. అయితే ఇందులో కేవలం రాచరిక దర్పమే కాదు.. ఈ హోటెల్‌కు సంబంధించి మరో మానవీయ కోణం కూడా ఉంది. రతన్ టాటా మూగజీవాలపై చూపే ప్రేమకు ఈ హోటల్ ఓ నిదర్శనంగా నిలిచింది. ఈ విషయాన్ని ప్రముఖ హెచ్‌ఆర్ నిపుణురాలు రుబీ ఖాన్ తన లింక్డిన్ పోస్టులో వెల్లడించారు.
ముంబైలోని ప్రతిష్టాత్మక తాజ్ మహల్ హోటల్‌లో బస చేయడానికి సంపన్నులే అతిథులుగా వస్తుంటారు. హోటల్ నిర్మాణంలో కూడా అడుగడుగునా రాజసం ఉట్టిపడుతుంది. అయితే ఇందులో కేవలం రాచరిక దర్పమే కాదు.. ఈ హోటెల్‌కు సంబంధించి మరో మానవీయ కోణం కూడా ఉంది. రతన్ టాటా మూగజీవాలపై చూపే ప్రేమకు ఈ హోటల్ ఓ నిదర్శనంగా నిలిచింది. ఈ విషయాన్ని ప్రముఖ హెచ్‌ఆర్ నిపుణురాలు రుబీ ఖాన్ తన లింక్డిన్ పోస్టులో వెల్లడించారు. తాను ఆ హోటల్‌కు వెళ్లినప్పుడు ఓ వీధి శునకం ప్రవేశద్వారం పక్కనే నిద్రపోవడాన్ని గమనించినట్లు రూబీ పేర్కొన్నారు. చాలా విలాసవంతమైన ఆ ప్రదేశంలో అది ఎందుకు ఉందా అనే సందేహం రావడంతో.. అక్కడే ఉన్న సిబ్బందిని దాని గురించి ప్రశ్నించినట్లు తెలిపారు. వారు చెప్పిన సమాధానం విని రతన్‌టాటాపై ఆమెకు గౌరవం మరింత పెరిగినట్లు పేర్కొన్నారు. ఆ శునకం పుట్టినప్పటి నుంచి అక్కడే పెరిగింది. హోటల్‌లో ఓ భాగమైపోయింది. అక్కడికి వచ్చే ఏ మూగజీవాన్నైనా జాగ్రత్తగా చూసుకోవాలని రతన్‌టాటా నుంచి ఆదేశాలున్నాయి అని సిబ్బంది వెల్లడించినట్లు రాసుకొచ్చారు
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభాస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. రిలీజ్ కు రెడీగా కల్కి ట్రైలర్
సీరియల్ హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ పెళ్లి ?? ఇదిగో క్లారిటీ
Vijay Sethupathi: ఫ్యాన్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన స్టార్ హీరో
TOP 9 ET News: పుష్ప2 ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. | పుష్ప రాజ్ 53 మిలియన్లుదేరవ 70 మిలియన్లు
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్‌లో దర్శనం!
లైక్స్ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

