Black Diamond Apple: అత్యంత అరుదైన బ్లాక్ డైమండ్ ఆపిల్.. దీని ధర ఎంతో తెలిస్తే షాక్..!

Black Diamond Apple: అత్యంత అరుదైన బ్లాక్ డైమండ్ ఆపిల్.. దీని ధర ఎంతో తెలిస్తే షాక్..!

Anil kumar poka

|

Updated on: Jun 05, 2022 | 10:30 AM

ఆపిల్ అనగానే ఎర్రగా గుండ్రంగా అందంగా కనిపించే ఆపిల్ గుర్తుకొస్తుంది. ఇప్పుడిప్పుడే గ్రీన్ ఆపిల్ కూడా మార్కెట్ లో విస్తృతంగా లభిస్తున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆపిల్స్ లో 7,500 పైగా రకాలు ఉన్నాయట.. వాటిల్లో బ్లాక్ యాపిల్ కూడా ఒకటి.


ఆపిల్ అనగానే ఎర్రగా గుండ్రంగా అందంగా కనిపించే ఆపిల్ గుర్తుకొస్తుంది. ఇప్పుడిప్పుడే గ్రీన్ ఆపిల్ కూడా మార్కెట్ లో విస్తృతంగా లభిస్తున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆపిల్స్ లో 7,500 పైగా రకాలు ఉన్నాయట.. వాటిల్లో బ్లాక్ యాపిల్ కూడా ఒకటి. ఈ బ్లాక్ డైమండ్ యాపిల్స్ ని చైనా వారు రెడ్ డెలిషియస్ ఆపిల్ అని పిలుస్తారు. ఇవి చాలా అరుదైనవి. అయితే ఇవి పేరుకే బ్లాక్ డైమండ్ యాపిల్స్ కానీ ఈ పండ్లు నల్లగా ఉండవు. ముదురు ఊదా రంగులో ఉంటాయి. దీనిని మొట్టమొదట టిబెట్ పర్వతాలోని ఒక చిన్న నగరమైన న్యింగ్‌లో పండించారు. ఈ ప్రాంతంలో పగటి పూట అతినీలలోహిత కాంతి ప్రసారమవుతుంది. అయితే రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలో అనూహ్యంగా హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఈ అసాధారణ వాతావరణ పరిస్థితుల వలన ఈ పండ్ల రంగు ఉదా రంగులోకి మారుతుంది. అయితే లోపల ఉన్న పదార్ధం నార్మల్ యాపిల్ లాగా తెల్లగానే ఉంటుంది.ఈ యాపిల్స్ టిబెట్, చైనాలతో పాటు యుఎస్ లో కూడా కనిపిస్తాయి. కానీ వీటిని ఎక్కువగా పండించడానికి రైతులు ఇష్టపడరు. ఎందుకంటే చెట్టు నుంచి పండ్లు పొందడానికి ఐదు నుండి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది. అంతేకాదు పండు రుచిగా మారడానికి కూడా ఎక్కువ సమయం నిల్వ చేయాల్సి ఉంటుంది. కనుక లాభసాటి కాదని ఈ బ్లాక్ డైమండ్ యాపిల్ ను పండించడానికి పెద్దగా ఆసక్తిని చూపించడం లేదని తెలుస్తోంది. సాధారణంగా ప్రతి సంవత్సరం కేవలం రెండు నెలలు మాత్రమే ఈ యాపిల్స్ అందుబాటులో ఉంటాయి. ఈ బ్లాక్ డైమండ్ యాపిల్స్ మంచి రుచి కలిగినప్పటికీ మనకు మార్కెట్ లో లభిస్తున్న సాధారణ యాపిల్స్ లో ఉన్నన్ని పోషకాలు ఇంఉదలో ఉండవని తెలుస్తోంది. పైగా వీటి ధరకూడా ఎక్కువే. ఈ బ్లాక్ డైమండ్ యాపిల్ ధర ఒకొక్కటి మన దేశ కరెన్సీలో 500 రూపాయలు ఉంటుంది. చైనాలో హై-ఎండ్ సూపర్ మార్కెట్స్‌లో మాత్రమే వీటిని విక్రయిస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 05, 2022 10:30 AM