Mother-Son: కోట్ల విలువైన కారును నదిలో పడేసిన వ్యక్తి.. తల్లి మరణం తరువాత కొడుకు మాయం..! షాకింగ్ వీడియో..
తల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. మనస్థాపంతో తానేం చేస్తున్నాడో తెలియని స్థితికి చేరుకున్నాడు. ఈ క్రమంలో కోట్ల విలువైన కారును నదిలో పడేశాడు. ఈ ఘటన కర్నాటకలోని శ్రీరంగపట్నంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే...
తల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. మనస్థాపంతో తానేం చేస్తున్నాడో తెలియని స్థితికి చేరుకున్నాడు. ఈ క్రమంలో కోట్ల విలువైన కారును నదిలో పడేశాడు. ఈ ఘటన కర్నాటకలోని శ్రీరంగపట్నంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే…బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కోటిన్నర విలువైన కారును నదిలో పడేశాడు. కావేరీ నదిలో తేలుతూ కనిపించిన ఈ కారును సమీప గ్రామస్తులు, మత్స్యకారులు గుర్తించి..ఏదో ప్రమాదం జరిగిందని భావించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ టీంను రంగంలోకి దింపి, నదిలో నుంచి కారును బయటకు తీసారు. అయితే ఆ కారులో ఎవరూ లేకపోవడంతో పోలీసులకు అనుమానం కలిగింది. కారు నెంబర్ ఆధారంగా ఆ కారు యజమాని బెంగళూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించి అతన్ని శ్రీరంగ పట్నానికి పిలిచి విచారించారు. అయితే తనను చంపడానికి ఎవరో ప్రయత్నించారని, వాళ్లనుంచి తప్పించుకోడానికి కారును నదిలో తోసేసినట్లు ఆ వ్యక్తి చెప్పాడు. అతని సమాధానంతో సంతృప్తి చెందని పోలీసులు అతని కుటుంబ సభ్యులను సంప్రదించారు. దాంతో తల్లి మరణాన్ని తట్టుకోలేక, మనస్తాపానికి గురై అలా చేసాడని తెలుసుకున్నారు. ఆ వ్యక్తి మానసిక స్థితిని అర్ధం చేసుకున్న పోలీసులు అతనికి ఎలాంటి ఫైన్ వేయకుండా వదిలేశారు. అనంతరం ఆ వ్యక్తి చికిత్స నిమిత్తం జాతీయ మానసిక ఆరోగ్య ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!