చనిపోయిన యజమానికోసం నిద్రాహారాలు మాని..చివరకు ??

కుక్క కంటే విశ్వాసమైన జంతువు ప్రపంచంలో మరేదీ ఉండదు. అందుకు నిదర్శనంగా నిలిచే అనేక సంఘటనలు తరచూ ఎక్కడో అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా కరీంనగర్‌ జిల్లాలో తనను పెంచి పోషించిన యజమాని చనిపోతే ఆ కుక్క నిద్రాహారాలు మాని, అతని కోసం ఎదురుచూస్తూ చూస్తూ చివరికి కన్నుమూసింది.

చనిపోయిన యజమానికోసం నిద్రాహారాలు మాని..చివరకు ??

|

Updated on: Aug 02, 2023 | 8:59 PM

కుక్క కంటే విశ్వాసమైన జంతువు ప్రపంచంలో మరేదీ ఉండదు. అందుకు నిదర్శనంగా నిలిచే అనేక సంఘటనలు తరచూ ఎక్కడో అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా కరీంనగర్‌ జిల్లాలో తనను పెంచి పోషించిన యజమాని చనిపోతే ఆ కుక్క నిద్రాహారాలు మాని, అతని కోసం ఎదురుచూస్తూ చూస్తూ చివరికి కన్నుమూసింది. తమ కుంటుంబంలో ఓ సభ్యుడిలా పెరిగిన ఆ కుక్కకు యజమాని సమాధి పక్కనే సమాధి చేసి నివాళులర్పించారు ఆ కుటుంబ సభ్యులు. సైదాపూర్‌ మండలం పెర్కపల్లికి చెందిన పోతరాజు వెంకటయ్య తొమ్మిదేళ్లుగా ఓ కుక్కను పెంచుకుంటున్నారు. దాని పేరు టిప్పు. ఆ కుక్కకు యజమాని అంటే వల్లమాలిన అభిమానం. అనేకసార్లు తన యజమానిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. వెంకటయ్య ఇంటిచుట్టూ చెట్లు చేమలు ఉండటంతో తరచూ ఆయన పెరట్లోకి పాములు చొరబడేవి. పాములబారినుంచి ఆ కుటుంబాన్ని అనేకసార్లు కాపాడింది టిప్పు. రోజూ వెంకటయ్యే దానికి అన్నం పెట్టేవాడు. అతని మంచం వద్దే అది పడుకునేది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bapatla: పుట్టింటికెళ్లిన భార్య తిరిగి రాలేదని భర్త మనస్థాపం.. నాటు తుపాకీతో..

శ్రీకాళహస్తిలో కళ్లు తెరిచిన శివలింగం.. అసలేం జరిగింది ??

న్యూడ్ కాల్ చేసావా సరే.. లేదంటే చంపేస్తా..!

రైతు కూలీగా ఎమ్మెల్యే.. మహిళలతో కలిసి వరినాట్లు

హిందీలో మాట్లాడినందుకు ఉద్యోగమే పోయింది

 

 

Follow us