Viral: పాముకాటుతో వ్యక్తి మృతి.. అతని చితి పైనే ఆ పామును పెట్టి ఏం చేశారంటే.!

ఓ విష సర్పం కరిచి 22 ఏళ్ల యువకుడు చనిపోయాడు. అయితే ఆ ఊరి జనాలు కరిచిన పాముని పట్టుకొని అది బతికి ఉండగానే అతడి చితిపై వేసి దహనం చేశారు. ఈ షాకింగ్ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఆదివారం జరిగింది. ఆ పాము బతికి ఉంటే మరింతమందికి హాని తలపెట్టే అవకాశం ఉంటుందని, అందుకే ఇలా చేశామని గ్రామస్థులు చెప్పారు. కొందరు వ్యక్తులు తాడుతో పాముని ఈడ్చుకెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

|

Updated on: Sep 30, 2024 | 9:18 AM

ఈ ఘటనపై జిల్లా స్థాయి అధికారి ఒకరు స్పందించారు. సరీసృపాలు, పాముకాట్లపై జనాలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బైగామర్ గ్రామానికి చెందిన దిగేశ్వర్ రాథియా అనే యవకుడు శనివారం రాత్రి తన ఇంట్లోని ఒక గదిలో మంచంపై పడుకుని ఉన్న సమయంలో అతడిని కట్లపాము కరిచిందని వెల్లడించారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు తక్షణమే హాస్పిటల్‌కు తరలించారని, కోర్బాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం అతడి ప్రాణాలు విడిచాడని అధికారి వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించారని తెలిపారు. అయితే యువకుడి చావుకు కారణమైన పామును అప్పటికే పట్టుకుని బుట్టలో పెట్టి మూత వేశారు. దానిని తాడుతో కట్టేసి ఓ కర్రకు వేలాడదీశారని అధికారి వివరించారు. రథియా మృతదేహాన్ని ఇంటి నుంచి ఊరేగింపుగా శ్మశానవాటికకు తీసుకెళ్లారని, గ్రామస్థులు పామును కూడా అక్కడికి ఈడ్చుకెళ్లారని, రథియా అంత్యక్రియల సమయంలో చితిపై సజీవంగా ఉన్న పామును పెట్టి దహనం చేశారన్నారు. వేరొకరిపై దాడి చేస్తుందేమోనన్న భయాందోళనతో చితిపై వేసి కాల్చిచంపారని కోర్బా సబ్ డివిజనల్ అధికారి ఆశిష్ ఖేల్వార్‌ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో కనిపించిందని అధికారి వివరించారు. పామును చంపిన గ్రామస్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన వివరించారు. పర్యావరణ వ్యవస్థకు సరీసృపాలు ముఖ్యమైనవి కాబట్టి పాముకాటుపై ప్రజలకు అవగాహన కల్పించడం అవసరమని ఆయన చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
మధుమేహం ఉన్న ప్రతి నలుగురిలో ఒకరికి గుండె జబ్బుల ప్రమాదం..

బిగ్‏బాస్ సండే ప్రోమో వచ్చేసింది..
బిగ్‏బాస్ సండే ప్రోమో వచ్చేసింది..
పుంగనూరులో చిన్నారి మృతి.. బాధిత కుటుంబానికి అండగా నేతలు

రాయల్‌ ఎన్‌ఫిల్డ్‌ బైక్‌ల రీకాల్‌.. కారణం ఏంటో తెలిపిన కంపెనీ!

బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్

ఒకప్పుడు ఆవుల కాపరిగా నెలకు రూ.80.. ఇప్పుడు ఏడాదికి రూ.8 కోట్లు!

మఫ్టీలో ఆకతాయిలు, పోకిరీల ఆటకట్టిస్తున్న షీ టీమ్..వారికి వణుకే..!

ఓవర్ థింకింగ్ పెను ప్రమాదకరమని మీకు తెలుసా..? ఎలా అధిగమించాలంటే..

వాట్ ఏ ఐడియా సర్ జీ.. డ్రోన్‌తో వినూత్న ప్రయోగం

మరోమారు వార్తల్లోకెక్కిన ఢిల్లీ మెట్రో.. ఈ సారి ఏం జరిగిందంటే..
మరోమారు వార్తల్లోకెక్కిన ఢిల్లీ మెట్రో.. ఈ సారి ఏం జరిగిందంటే..
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..

తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..

అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!

మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!

దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..

సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!

వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..

మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి

ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!