AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెరుచుకోని విమానం డోర్లు.. లోపలే చిక్కుకున్న ప్రయాణికులు..చివరకు వీడియో

తెరుచుకోని విమానం డోర్లు.. లోపలే చిక్కుకున్న ప్రయాణికులు..చివరకు వీడియో

Samatha J
|

Updated on: Aug 15, 2025 | 5:43 PM

Share

ఎయిరిండియా విమానంలో ప్రయాణికులను భయపెట్టిన ఘటన తాజాగా జరిగింది. ఢిల్లీ నుంచి రాయ్‌పూర్ చేరుకున్న విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే డోర్ తెరుచుకోకపోవడంతో ఓ ఎమ్మెల్యే సహా 160 మంది ప్రయాణికులు లోపలే చిక్కుకుపోయారు. రాయ్‌పూర్‌ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఎయిరిండియా విమానం ఆదివారం రాత్రి 8 గంటలకు ఢిల్లీలో బయలుదేరి 10 గంటలకు రాయ్‌పూర్‌ చేరుకుంది.

రాయ్‌పూర్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ తర్వాత విమానం డోర్ తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. విమానంలో బిలాస్‌పూర్ జిల్లా కోట నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అటల్ శ్రీవాస్తవ కూడా ఉన్నారు.దాదాపు గంట పాటు విమానం డోర్లు తెరుచుకోకపోవడం, సిబ్బంది సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. అదే సమయంలో విమానంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో వారి ఇబ్బందులు రెట్టింపయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చివరికి ఎయిర్‌లైన్స్ సిబ్బంది స్పందించారు. సాంకేతిక లోపం కారణంగా డోర్‌ తెరుచుకోలేదని చెప్పారు. చివరకు రాత్రి 11 గంటల తర్వాత సాంకేతిక సమస్యను సరిచేసి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సోమవారం మధ్యాహ్నం వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఎయిరిండియా విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం, ప్రయాణికులకు సరైన సమాచారం ఇవ్వడంలో సిబ్బంది విఫలం అవుతున్నారన్న విమర్శలు వచ్చాయి.

మరిన్ని వీడియోల కోసం :

వీడే నా తమ్ముడు.. చిరుతకు రాఖీ కట్టిన మహిళ వీడియో

పక్షి రాజ్‌ “పన్నాలాల్‌”ఎంత గొప్ప మనసు.. వీడియో

బంగారం కావాలా? ఈ క్రిమిని పెంచుకుంటే పోలా వీడియో

రాఖీ కట్టేందుకు 14 ఏళ్లుగా ఎదురుచూస్తున్న సోదరి వీడియో