Dosa Man: నాడు రూ.150 జీతంతో వెయిటర్‌.. నేడు దోశ ప్లాజాతో 100 కోట్లకు అధిపతి.. కథ వింటే పూనకాలే.

ఓ సామాన్య యువకుడు నెలకు 150 రూపాయల జీతంతో మొదలు పెట్టి.. కృషితో పట్టుదలతో వందల కోట్లు సంపాదించే స్టేజ్ కు చేరుకున్నాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి..

Dosa Man: నాడు రూ.150 జీతంతో వెయిటర్‌..  నేడు దోశ ప్లాజాతో 100 కోట్లకు అధిపతి.. కథ వింటే పూనకాలే.

|

Updated on: Jul 01, 2022 | 9:13 AM


ఓ సామాన్య యువకుడు నెలకు 150 రూపాయల జీతంతో మొదలు పెట్టి.. కృషితో పట్టుదలతో వందల కోట్లు సంపాదించే స్టేజ్ కు చేరుకున్నాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి.. బతకడం కోసం వెయిటర్ గా పనిచేసి.. నేడు తనకంటూ ఓ వ్యాపార సామ్రాజ్ఞాన్ని సృష్టించుకున్నాడు.. అతనే ప్రేమ్ గణపతి.. తమిళనాడు నుంచి 17 ఏళ్ల వయసులో ఇంట్లో చెప్పకుండా వచ్చి ముంబై చేరుకున్నాడు. ఓ బేకరీలో అంట్లు తోమే పనిలో జాయిన్ అయ్యాడు. ఆ బేకరీ యజమాని ప్రేమ్ కు తిండి పెట్టి.. షెల్టర్ ఇచ్చి నెలకు 150 రూపాయలు ఇచ్చాడు. అలా రెండు ఏళ్ళు పనిచేశాడు. మరికొన్నాళ్లకు ఫిజా డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. ఎదుగుబొదుగు లేని జీవితం ఎన్నాళ్లు అనుకున్నాడు.. తెలుసున్న వారిదగ్గర చేబదులు తీసుకొని ఓ బండి పై టిఫిన్ అమ్మడం మొదలు పెట్టాడు. రూమ్స్ మేట్స్ ద్వారా కంప్యూటర్ నాలెడ్జ్ సంపాదించాడు. అప్పుడే వ్యాపారం పై దృష్టి పెట్టాడు. ఇంతలో మెక్ డొనాల్డ్స్‌ ప్రేమ్ బండి పెట్టుకొనే ప్లేస్ పక్కనే ఓ రెస్టారెంట్ ఓపెన్ చేశారు. అది ఎంత తక్కువ సమయంలో పాపులర్ అయిందో చూశాడు. దీంతో తను కూడా రెస్టారెంట్ పెట్టాలనుకున్నాడు.1997లో ఓ చిన్న ప్లేస్ ను లీజ్ కు తీసుకొన్నాడు. దానికి నెలకు 5 వేలు రెంట్.. ప్రేమ్ దోశ ప్లాజా పేరుతో రెస్టారెంట్ ను ఓపెన్ చేశాడు. మొదటిసారి స్ప్రింగ్ రోల్ దోశ, పన్నీర్ చిల్లీ దోశ వంటి 26 డిఫరెంట్ దోశలను ముంబై వాసులకు పరిచయం చేశాడు. దీంతో 2002 నాటికి ప్రేమ్ దోశ అందరికీ ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ అడ్డాగా మారింది. ఇలా 130 వరకూ రకరకాల దోశలు వెయ్యడం మొదలు పెట్టాడు. ఇంతలో గణపతి దోశ ప్లాజా దగ్గర ఓ పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ అయ్యింది. దానిలో ఉన్న మేనేజ్ మెంట్ సిబ్బంది మొత్తం ఇతని రెస్టారెంట్ లోనే టిఫిన్ తినేవారు. ఓ రోజు ఆ షాపింగ్ మాల్ యజమాన్యం తమ షాపింగ్ మాల్ లో స్టాల్ పెట్టమని సలహా ఇచ్చారు. దీంతో ప్రేమ్ గణపతి దశ తిరిగింది.మన దేశం మొత్తమ్మీద 45 ఔట్ లెట్స్ తెరిచారు. యూఏయి, ఒమన్, న్యూజిల్యాండ్‌ మూడు దేశాల్లో కలిపి 72 ఇంటర్నేషనల్ ఔట్ లెట్స్ ఓపెన్‌ చేశారు. అంతేకాదు ప్రేమ్ కు ఫ్రాంచైజీ రిక్వెస్ట్ లు విదేశాలనుంచి స్వదేశం నుంచి వెల్లువెత్తాయి. ఒకప్పుడు 150 జీతంతో బతికిన గణపతి… నేడు కరోడ్ పతి.. వంద కోట్ల సంస్థ అధిపతి.. చిన్న చిన్న కారణాలతో చదువు మానేసి, అన్ని సౌకర్యాలు ఉండి కూడా నిరాశగా బతికే నేటి యువతకు ఆదర్శం ప్రేమ్ గణపతి..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్‌ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..

Follow us