AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణం తీసిన చేప.. మృతి వెనుక అసలేం జరిగింది ??

ప్రాణం తీసిన చేప.. మృతి వెనుక అసలేం జరిగింది ??

Phani CH
|

Updated on: Apr 08, 2026 | 2:47 PM

Share

ఒడిశాలోని మయూరభంజ్ జిల్లాలో చేపలు పడుతుండగా ఒక యువకుడు చేప గొంతులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. సకాలంలో సరైన చికిత్స అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం వహించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వైద్యులు కూడా దాడి చేశారంటూ ఎదురు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఒడిశాలోని మయూరభంజ్ జిల్లా దిఘి గ్రామంలో ఎప్పటిలాగే చేపలు పట్టేందుకు వెళ్లాడు ఓ యువకుడు. అవినాశ్ బిజులి సమీప గ్రామంలోని చెరువుకు చేపలు పట్టేందుకు వెళ్లాడు. చెరువులో చేపలు పడుతుండగా అవినాష్ ఒక జీవంతో ఉన్న చేపను పట్టుకున్నాడు.దానిని నోటితో పట్టుకుని నియంత్రించేందుకు ప్రయత్నించిన సమయంలో ఆ చేప ఒక్కసారిగా అతని నోటిలోకి జారిపోయింది. వెంటనే అది గొంతులో ఇరుక్కుపోవడంతో అవినాష్ శ్వాస తీసుకోలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అక్కడున్నవారు వెంటనే పరిస్థితిని గుర్తించి అతన్ని బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం అతడిని అత్యవసరంగా బాంగిరిపోసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే పరిస్థితి మరింత విషమించగా, వైద్యులు చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పటికీ అవినాశ్ ప్రాణాలు నిలబెట్టలేకపోయారు. అయితే ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యాన్ని ఆరోపిస్తున్నారు. సమయానికి సరైన చికిత్స అందించలేదని, పదేపదే వేడుకున్నప్పటికీ వైద్యుడు రోగిని పరిశీలించలేదని వారు ఆవేదన వ్యక్తం చేసారు. మృతుడి తండ్రి శివచరణ్ బిజులి మాట్లాడుతూ, తమ కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత కూడా వైద్యుడు ఆలస్యంగా స్పందించారని ఆరోపించారు. అంతేకాకుండా వైద్యుడు అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా జాతి పరమైన వ్యాఖ్యలు కూడా చేశారని ఆయన ఆరోపించారు. వెంటనే చికిత్స చేయకుండా బారిపడాకు రిఫర్ చేయడం వల్ల సమయానికి చికిత్స అందకపోవడం ప్రాణాంతకమైందని కుటుంబ సభ్యులు అంటున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆసుపత్రి ప్రాంగణంలో వాగ్వాదం తోపులాట కూడా జరిగినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యులు బాంగిరిపోసి పోలీస్ స్టేషన్‌లో వైద్యులపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు తమపై దాడి జరిగిందని వైద్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదు అయింది. ఘటనపై పోలీసులు రెండు వైపుల ఫిర్యాదులను స్వీకరించి సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బారిపడా పీర్‌ఎం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. సాధారణంగా చేపలు పట్టే క్రమంలో ప్రమాదం ఎదురవుతుందని ఎవ్వరూ ఊహించరు. కానీ ఈసారి మాత్రం చిన్న నిర్లక్ష్యం అతడి ప్రాణాన్ని బలితీసుకుంది. అలాగే అత్యవసర వైద్యసేవల ప్రాముఖ్యం, సమయానికి స్పందించాల్సిన బాధ్యతపై కూడా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బురఖాలో వచ్చింది.. గన్‌ బయటకు తీసింది.. ఆ తర్వాత..

ఆ అర్చకులకు గర్భాలయంలోకి నో ఎంట్రీ

Trisha: ప్రేమపై త్రిష పోస్టు.. ట్రెండింగ్ లో లవ్ కోట్స్

తహసీల్దారుకే కుచ్చు టోపీ పెట్టిన కేటుగాడు.. ఏం చేశాడంటే

Yasaswi Kondepudi-Jaanu: బ్రేకప్‌ కాదు.. కొత్తగా ప్యాచప్‌..! బ్రేకప్ ట్విస్ట్ అదుర్స్

Follow Us