AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha:  ప్రేమపై త్రిష పోస్టు.. ట్రెండింగ్ లో లవ్ కోట్స్

Trisha: ప్రేమపై త్రిష పోస్టు.. ట్రెండింగ్ లో లవ్ కోట్స్

Phani CH
|

Updated on: Apr 08, 2026 | 12:34 PM

Share

త్రిష పెట్టిన లవ్ కోట్స్ ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్. విజయ్‌తో ఆమెకున్న బంధంపై నెలకొన్న ఊహాగానాలకు ఈ పోస్టులు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లను అందిపుచ్చుకోవడంలో త్రిష చాకచక్యం కనిపిస్తోందని కొందరు భావిస్తున్నారు. ఇది ఆమె కెరీర్ వ్యూహమా లేక నిజమైన ప్రేమనా అనే చర్చ జరుగుతోంది. ఆమె నటించిన 'విశ్వంభర', 'రామ్' సినిమాలు విడుదల కానున్నాయి.

ట్రెండింగ్‌ హ్యాష్‌ట్యాగ్స్ ని క్యాచ్‌ చేస్తే రీచ్‌ ఎక్కువగా ఉంటుందన్నది డిజిటల్‌ మీడియాలో సక్సెస్‌ఫుల్‌ ఫార్ములా. ఎప్పటికప్పుడు ట్రెండ్‌లో ఉండే త్రిష కూడా ఈ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు. అందుకే ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్‌నే సెలక్ట్ చేసుకున్నారు. ఆ టాపిక్‌ కూడా తనకు బ్రహ్మాండంగా రిలేట్‌ అయ్యేలా చూసుకోవడం ఇక్కడ ఈ బ్యూటీ స్పెషాలిటీ. త్రిష పేరు వినగానే ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాలేంటి? అనే మాట కన్నా, విజయ్‌తో ఆమెకున్న రిలేషన్‌ ఏంటి? అనే టాపిక్కే ఎక్కువగా నడుస్తోంది. పెళ్లా? నాకా? అంటూ మొన్న మొన్నటిదాకా కటింగ్‌ ఇచ్చిన ఈ లేడీ ఇప్పుడు ప్రేమ గురించి ప్రేమగా కోట్స్ పెట్టే రేంజ్‌కి చేరుకోవడం ఇన్వైట్‌ చేయదగ్గ ఛేంజే అంటున్నారు దగ్గరివారు. ప్రతిదీ ప్రేమ కాదు.. కానీ, ప్రేమ లేకుండా ఏదీ లేదు.. అంటూ త్రిష పెట్టిన పోస్టు, ఫ్యాక్ట్ అంటూ యాడ్‌ చేసిన వర్డు ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌. విజయ్‌ – త్రిష మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అంటూ వస్తున్న వార్తలకు ఈ కోట్‌ ఆజ్యం పోస్తుందన్నది ట్రెండ్ అవుతున్న డిస్కషన్‌. సూర్యతో కరుప్పు సినిమాలో నటిస్తున్న త్రిష.. ఆ మూవీ ప్రమోషన్ల కోసం మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆ టైమ్‌లో ఈ విషయాలన్నీ మరోసారి డిస్కషన్‌కి వస్తాయన్నమాట. అయితే, ఈ చెన్నై బ్యూటీ అందరి ప్రశ్నలకు ఓపెన్‌గా సమాధానమిస్తారా? లేకుంటే వాటిని ప్రస్తావించవద్దంటూ ఆంక్షలు పెడతారా? అనే అనుమానాలు కూడా మరోవైపు లేకపోలేదు. తెలుగు ఆమె నటించిన విశ్వంభర రిలీజ్‌కి ముస్తాబవుతోంది. అటు కేరళలోనూ మోహన్‌లాల్‌తో ‘రామ్‌’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్‌ లో ఉంది. ఈ సినిమాలు రిలీజ్‌ అయ్యాక త్రిష ఏం చేస్తారనే విషయం మీద కూడా డిస్కషన్‌ జరుగుతోంది. మిగిలిన హీరోయిన్ల ఫిల్మోగ్రఫీలు లెంగ్తీగా ఉంటే, త్రిష మాత్రం వాంటెడ్‌గానే ఎంప్టీ చేస్తున్నారా? అనే డిస్కషన్‌ కూడా షురూ అయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తహసీల్దారుకే కుచ్చు టోపీ పెట్టిన కేటుగాడు.. ఏం చేశాడంటే

Yasaswi Kondepudi-Jaanu: బ్రేకప్‌ కాదు.. కొత్తగా ప్యాచప్‌..! బ్రేకప్ ట్విస్ట్ అదుర్స్

Biker Collection: బాక్సాఫీస్‌ దగ్గర రఫ్ఫాడిస్తున్న బైకర్

Ramana Gogula: రమణ గోగుల నోట గమ్మత్తైన పాట

Demon Pavan: నన్ను రాక్షసుడిగా మార్చొద్దు.. ట్రోలర్స్‌కు హెచ్చరిక

Follow Us