బురఖాలో వచ్చింది.. గన్ బయటకు తీసింది.. ఆ తర్వాత..
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఒక జ్యువెలరీ షాపులో బురఖా ధరించిన మహిళ పట్టపగలే సాహసోపేత దోపిడీకి పాల్పడింది. కస్టమర్‌గా నటిస్తూ, పిస్టల్‌తో యజమానిని బెదిరించి బంగారు నగలను చోరీ చేసింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయి వైరల్ అవుతున్నాయి. పోలీసులు నిందితురాలిని గుర్తించారు, పిస్టల్ నకిలీది కావచ్చునని అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఓ జ్యువెలరీ షాపులోకి బురఖావేసుకొని వచ్చిన మహిళ ఎంతో చాకచక్యంగా చోరీకి పాల్పడింది. రెప్పపాటులో జరిగిపోయిన ఈ దోపిడీతో షాపు యజమాని షాకయ్యాడు. దొంగను పట్టుకునేందుకు పరుగెత్తినా ఫలితం లేకపోయింది. సినిమా ఫక్కీలో పట్టపగలే జరిగిన ఈ లూటీ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లా రుదౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ చోరీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అగర్వాల్ కాంప్లెక్స్‌లోని ఒక జ్యువెలరీ షాపులోకి గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో బురఖా ధరించిన ఓ మహిళ ప్రవేశించింది. తొలుత కొన్ని బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే కస్టమర్‌లా నటించి వాటిని నిశితంగా పరిశీలించింది. షాపు యజమాని నమ్మిన తర్వాత, ఆమె ఒక్కసారిగా తన వద్ద ఉన్న పిస్టల్‌ను తీసి యజమానికి గురిపెట్టింది. దీంతో షాక్‌కు గురైన యజమాని ప్రాణభయంతో వెనక్కి తగ్గగా, ట్రేలో ఉన్న బంగారు నగలను తీసుకుని ఆమె క్షణాల్లో అక్కడి నుంచి పరారైంది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు షాపులోని సీసీటీవీ ఫుటేజీని పరశీలించారు. నిందితురాలిని ఇప్పటికే గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, దోపిడీకి ఆమె వాడిన పిస్టల్ నకిలీది అయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి సాహసానికి ఒడిగట్టడం స్థానికంగా కలకలం రేపింది. త్వరలోనే నిందితురాలిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ అర్చకులకు గర్భాలయంలోకి నో ఎంట్రీ
Trisha: ప్రేమపై త్రిష పోస్టు.. ట్రెండింగ్ లో లవ్ కోట్స్
తహసీల్దారుకే కుచ్చు టోపీ పెట్టిన కేటుగాడు.. ఏం చేశాడంటే
Yasaswi Kondepudi-Jaanu: బ్రేకప్ కాదు.. కొత్తగా ప్యాచప్..! బ్రేకప్ ట్విస్ట్ అదుర్స్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

