AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాట్సప్‌లో పెళ్లి పిలుపు..శుభలేఖ అనుకుని ఫైల్‌పై క్లిక్‌ చేస్తే వీడియో

వాట్సప్‌లో పెళ్లి పిలుపు..శుభలేఖ అనుకుని ఫైల్‌పై క్లిక్‌ చేస్తే వీడియో

Samatha J
|

Updated on: Aug 27, 2025 | 1:14 PM

Share

పూర్వం పెళ్లి అనగానే నెలరోజుల ముందునుంచే బంధువులందరికీ ఇంటింటికీ వెళ్లి స్వయంగా శుభలేఖలు ఇచ్చి అభిమానంగా ఆహ్వానించేవారు. ప్రస్తుతం కాలం మారిపోయింది. అన్నీ ఆన్‌లైన్‌లోనే. వాట్సప్‌లో ఓ ఇన్విటేషన్ పంపించి పిలుపులు అయిపోయాయి అనుకుంటున్నారు. పెళ్లిళ్లే ఆన్‌ లైన్లో జరిగిపోతుంటే.. ఇదేమంత విడ్డూరం కాదుగానీ.. ఇప్పడు దీనిని కూడా క్యాష్ చేసుకుంటున్నారు సైబర్‌ మోసగాళ్లు.. అదెలా అంటే..మహారాష్ట్రలోని హింగోలీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్‌లో గుర్తుతెలియని నంబర్ నుంచి ఓ సందేశం వచ్చింది.

అందులో “ఆగస్టు 30న మా వివాహం, తప్పకుండా రండి. ఆనందం అనే గేట్లు తెరిచే తాళం ప్రేమే” అంటూ ఆకర్షణీయమైన మాటలతో పాటు ఓ ఫైల్‌ను జతచేశారు. దాన్ని పెళ్లి పత్రిక అనుకుని భావించిన బాధితుడు ఏమాత్రం ఆలోచించకుండా క్లిక్ చేశాడు. అది ప్రమాదకరమైన ఏపీకే ఫైల్ కావడంతో, అది ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయింది. వెంటనే సైబర్ నేరగాళ్లు ఆయన ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఫోన్‌లోని గ్యాలరీ, కాంటాక్టులు, బ్యాంకు యాప్‌ల వివరాలను సేకరించి, క్షణాల్లో ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.1.90 లక్షలను వేరే ఖాతాకు బదిలీ చేసేశారు. డబ్బులు పోయినట్లు గుర్తించిన బాధితుడు వెంటనే హింగోలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటన సైబర్ మోసాల తీవ్రతకు అద్దం పడుతోంది. గత ఏడాది నుంచి ఇలాంటి ‘వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కామ్‌లు’ ఎక్కువయ్యాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా నేరగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. పీడీఎఫ్ ఫైల్స్ మాదిరిగా కనిపించేలా ఏపీకే ఫైల్స్‌ను పంపి, వాటిని డౌన్‌లోడ్ చేయగానే ఫోన్‌ను హ్యాక్ చేస్తున్నారు. తద్వారా డబ్బులు దొంగిలించడం లేదా వ్యక్తిగత సమాచారంతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడే ప్రమాదం ఉంది. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఫైల్స్‌ను, ముఖ్యంగా ‘.apk’ ఎక్స్‌టెన్షన్‌తో ఉన్నవాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని సూచిస్తున్నారు. సందేశం తెలిసిన వారి నుంచి వచ్చినా, ఫైల్ డౌన్‌లోడ్ చేసే ముందు వారికి ఫోన్ చేసి నిర్ధారించుకోవడం మంచిదంటున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు

మరిన్ని వీడియోల కోసం :

ఖైరతాబాద్‌ గణపతిని చూశారా?వీడియో

తాత నువ్వు కేక.! ఇలా కూడా వ్యాపారం చేయొచ్చా?వీడియో

కొడుకు ప్రాణాల కోసం.. మొసలితో తల్లి ఫైటింగ్‌ వీడియో