కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??

Updated on: Jan 10, 2026 | 9:00 AM

మిజోరం శాస్త్రవేత్తలు 'కలమరియా మిజోరామెన్సిస్' అనే కొత్త రెల్లు జాతి పామును కనుగొన్నారు. ఈ నాన్-విషపూరిత, చిన్న పాము రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది, భారతదేశ జీవవైవిధ్యాన్ని గ్లోబల్ మ్యాప్‌లో నిలిపింది. 15 సంవత్సరాల పరిశోధన తర్వాత దీని గుర్తింపు, ప్రకృతి రహస్యాలను వెల్లడిస్తుంది. దీని గురించి జూటాక్సా పత్రికలో ప్రచురించారు.

మిజోరం సైంటిస్ట్‌లు ఓ కొత్తరకం రెల్లు జాతి పామును గుర్తించారు. రాష్ట్రం పేరు కలిసొచ్చేలా మిజోరామెన్సిస్‌ అని పేరు పెట్టారు. భారత సరీసృపాల వర్గీకరణలో చాలాకాలంగా ఉన్న తప్పులను సరిచేసి, కొత్త రకం జాతులను చేర్చడం కోసం చేపట్టిన పరిశోధనల్లో దీన్ని గుర్తించారు. mizoramensis కేవలం ఒక కొత్త పాము మాత్రమే కాదు. ప్రకృతి ఇంకా అనేక రహస్యాలను తనలో దాచుకుని ఉందని నిరూపించే సాక్ష్యం. దీన్ని కనుగొనడం మిజోరాం‌కు గర్వకారణంగా నిలిచింది. భారతదేశాన్ని గ్లోబల్ జీవవైవిధ్య పటంలో నిలిపింది. ఈ పరిశోధన ఫలితాలను జూటాక్సా పత్రికలో ప్రచురించారు. Calamaria mizoramensis ఒక చిన్న పరిమాణంలోని పాము. పొడవు 20 నుంచి 30 సెంటీమీటర్లే. శరీరం పలుచగా, గోధుమ-బూడిద రంగులో ఉంటుంది. ఇది పూర్తిగా విషం లేని పాము. ఎక్కువగా నేల కింద జీవిస్తుంది. చురుగ్గా ఉండే నిశాచర జీవి కావడంతో ప్రధానంగా రాత్రిపూటే బయటకు వస్తుంది. దీని ఆహారం ప్రధానంగా కీటకాలే, అందువల్ల ఇది సాధారణంగా మనుషుల కంటికి పెద్దగా కనిపించకుండా దాగి ఉంటుంది. ఈ పాము కథ 2008లో మొదలైంది. మిజోరాం విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో అప్పట్లో ఈ పాము నమూనాను కనుగొన్నారు. మొదట శాస్త్రవేత్తలు అది ఆగ్నేయ ఆసియాకు చెందిన ఇప్పటికే తెలిసిన ఒక జాతికి చెందినదని భావించారు. అయితే డీఎన్‌ఏ సీక్వెన్సింగ్ వేరేలా నిరూపితమైంది. 15 సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత అంతర్జాతీయ సంస్థల సహకారంతో ప్రకృతిలో దాగున్న రహస్యాన్ని ఛేదించారు సైంటిస్ట్‌లు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఆధార్‌’ అక్రమాలకు అడ్డుకట్ట.. కొత్త డిజిటల్ యాప్ వచ్చేసింది

అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే..

సంక్రాంతికి లగ్జరీ కారవాన్‌లో జాలీ ట్రిప్.. ఏపీ టూరిజం స్పెషల్ ప్యాకేజీ రెడీ

రోబోలకు నొప్పి తెలుస్తుంది.. సైంటిస్టుల ప్రయోగం సక్సెస్‌

హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. 37శాతం డేంజర్ జోన్‌లోనే