స్కూళ్లలో విద్యార్ధులు ఉపాధ్యాయులను ‛మేడం.. సార్..’ అని ఇకపై పిలవకూడదట! మరేం పిలవాలని అనుకుంటున్నారా..? కేవలం ‘టీచర్’ అనే పిలవాలట. మహిళా, పురుష ఉపాధ్యాయులు ఎవరినైనా లింగబేధం లేకుండా పాఠశాల ఉపాధ్యాయులందరినీ ‘టీచర్’ అని మాత్రమే సంబోధించాలని కేరళ బాలల హక్కుల ప్యానెల్ ఆదేశించింది. ‘టీచర్’ అనేది లింగ తటస్థ పదమని వాటిని సంబోధించడానికి కేరళ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేరళ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ‘టీచర్’ అనే పదాన్ని ఉపయోగించాలని ప్యానెల్ చైర్‌పర్సన్ కేవీ మనోజ్ కుమార్, సీ విజయకుమార్‌లతో కూడిన ధర్మాసనం విద్యాశాఖను ఆదేశించింది. ’సర్’/’మేడమ్’ అనే పదాలు గౌరవప్రదంగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయులనే భావనతో అవి సరిపోలడం లేదని ప్యానెల్ అభిప్రాయ పడింది. పాఠశాలల్లో దీనిని ప్రవేశపెట్టిన రెండు నెలలోపు నివేదిక సమర్పించాలని జనరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌ను ఆదేశించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..