Father in Son marriage: కొడుకు పెళ్లిలో రెచ్చిపోయిన తండ్రి.. ఏం చేశాడో చూడండి..! నెట్టింట ఊపేస్తున్న వీడియో..
తల్లిదండ్రులు పెళ్లీడుకొచ్చిన తమ కుమారుడు లేదా కుమార్తెకు వివాహం జరిపించడం అంటే చాలా గర్వంగా ఫీలవుతారు. ఇక వివాహంలో ప్రతి అంశానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇక వివాహ సమయంలో
తల్లిదండ్రులు పెళ్లీడుకొచ్చిన తమ కుమారుడు లేదా కుమార్తెకు వివాహం జరిపించడం అంటే చాలా గర్వంగా ఫీలవుతారు. ఇక వివాహంలో ప్రతి అంశానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇక వివాహ సమయంలో బంధుమిత్రుల సందడి, సరదా షరామామూలే. కానీ ఇటీవల పెళ్లిళ్ల ట్రెండ్ మారింది. ప్రతిఒక్కరూ తమ ఇంట జరిగే వివాహం ఎంతో ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో వధూవరులే తమ వివాహంలో రకరకాల డాన్సులు, రొమాన్స్‌లు.. చిలిపి చేష్టలు చేసేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి తమ కుమారుడి పెళ్లిలో డాన్స్‌తో అదరగొట్టాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ‘యే జవానీ హై దివానీ’ మూవీలోని ‘బద్‌తమీజ్ దిల్’ పాటకు వరుడి తండ్రి క్రేజీ స్టెప్స్‌తో నెటిజన్లను అలరించారు. అద్భుతమైన అతని పెర్‌ఫార్మెన్స్ నెటిజన్లను ఆకట్టుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 10 లక్షలమందికి పైగా వీక్షించారు. లైక్స్‌తో, కామెంట్లతో హోరెత్తించారు. ప్రతి తండ్రి తన కొడుకు పెళ్లిలో ఇలా ఎంజాయ్ చేయాలని తాను కోరుకుంటున్నాని ఓ యూజర్ అంటే ..అసలు ఈ పాట అర్ధం ఏంటో తనకు ఇవాళ తెలిసిందని..అంకుల్ డ్యాన్స్‌తో ఇరగదీశాడని మరో యూజర్ కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..