Nepal: డేంజరస్ ‘టేబుల్ టాప్ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం.
నేపాల్ రాజధాని కాఠ్‌మాండూలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతున్న ఓ విమానం హఠాత్తుగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగింది టేబుల్ టాప్ రన్‌వేపై..! ఇలాంటి వాటిపై టేకాఫ్, ల్యాండింగ్ కఠిన సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ఎయిర్‌పోర్టుల్లో జరిగే విమాన ప్రమాదాల్లో అత్యధికం ఇలాంటి రన్‌వేలపైనే చోటుచేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
నేపాల్ రాజధాని కాఠ్‌మాండూలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతున్న ఓ విమానం హఠాత్తుగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగింది టేబుల్ టాప్ రన్‌వేపై..! ఇలాంటి వాటిపై టేకాఫ్, ల్యాండింగ్ కఠిన సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ఎయిర్‌పోర్టుల్లో జరిగే విమాన ప్రమాదాల్లో అత్యధికం ఇలాంటి రన్‌వేలపైనే చోటుచేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎత్తైన ప్రదేశాల్లో ఉండే రన్‌వేలను టేబుల్ టాప్ రన్‌వే లు అంటారు. ఈ రన్‌వేలు చుట్టుపక్కల భూభాగం కంటే ఎత్తులో ఉంటాయి. వీటికి ఒకవైపు లేదా రెండు వైపులా లోయ మాదిరిగా ఉంటుంది. కానీ దూరం నుంచి చూస్తే రన్‌వే, పక్కనున్న భూభాగం సమాంతరంగానే ఉన్నట్లు భ్రమింపచేస్తాయి. ఇక్కడ టేకాఫ్, ల్యాండింగ్ చేసేటప్పుడు పైలట్ అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలి. ఏ చిన్న పొరబాటు జరిగినా విమానం ఓవర్‌షూట్ అయి పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంటుంది. తాజాగా నేపాల్‌లో ప్రమాదానికి ఇదీ ఓ కారణమేనని తెలుస్తోంది.
నేపాల్‌లో తరచూ విమాన ప్రమాదాలు జరగడానికి ఇలాంటి సవాళ్లతో కూడుకున్న రన్‌వేలు కూడా ఓ కారణమే అని నిపుణులు చెబుతున్నారు. ఆ దేశంలో ఇలాంటివి ఏడు ఉన్నాయి. భారత్‌లోనూ ఐదు టేబుల్‌టాప్ రన్‌వేలు ఉన్నాయి. 2020లో దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసిన కొజికోడ్ విమాన ప్రమాదం జరిగింది ఇలాంటి రన్‌వేపైనే.! 2020 ఆగస్టులో కొవిడ్ మహమ్మారి సమయంలో ‘వందేభారత్ మిషన్’లో భాగంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం దుబాయి నుంచి కోజికోడ్‌కు చేరుకొంది. అది ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పి రన్‌వే నుంచి జారి 35 అడుగుల లోయలో పడింది. ప్రమాద సమయంలో విమానంలో 190 మంది ఉండగా.. ఇద్దరు పైలట్లు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు పదేళ్ల క్రితం 2010 మే 22న దుబాయ్ నుంచి మంగళూరు వచ్చిన మరో ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కూడా ఇదే తరహాలో ప్రమాదానికి గురవ్వగా.. 158 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.