Nashik Temples: నీట మునిగిన నాసిక్ లోని ప్రసిద్ధ ఆలయాలు.. వీడియో
మహారాష్ట్రలో కూడా భారీవర్షాలు కురుస్తున్నాయి. నాసిక్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గోదావరి వరద ఉధృతి పెరగడంతో నాసిక్ లోని చాలా ఆలయాలు నీట మునిగాయి.
మహారాష్ట్రలో కూడా భారీవర్షాలు కురుస్తున్నాయి. నాసిక్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గోదావరి వరద ఉధృతి పెరగడంతో నాసిక్ లోని చాలా ఆలయాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే వందలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు, గుజరాత్‌లోనూ భారీవర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజ్‌కోట్, జామ్‌నగర్ ప్రాంతాల్లో వరదల కారణంగా అపార నష్టం జరిగింది. జామ్‌నగర్‌లో వరదనీటిలో చాలా కార్లు కొట్టుకుపోయాయి. జామ్‌నగర్‌లో ఎక్కువగా లగ్జరీ కార్లు వరదనీటిలో కొట్టుకుపోవడంతో ఓనర్లు లబోదిబోమంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Sarayu: బిగ్ బాస్ అన్యాయం చేశాడంటూ ఏడ్చేసిన సరయూ.. వీడియో
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆ సౌకర్యం కూడా.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos